Mega Daughter Sushmita: పీరియడ్స్ గురించి మాట్లాడటానికి సిగ్గు పడకూడదు

ABN , First Publish Date - 2022-09-29T18:51:47+05:30 IST

పీరియడ్స్ (Peroids).. ప్రతి ఆడపిల్ల జీవితంలో సంభవించే ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఈ ప్రకృతి ధర్మాన్ని అవమానకర విషయంగా, దాన్ని దాచి ఉంచాలనే ధోరణిలో చాలామంది మహిళలు భావిస్తారు..

Mega Daughter Sushmita: పీరియడ్స్ గురించి మాట్లాడటానికి సిగ్గు పడకూడదు

పీరియడ్స్ (Peroids).. ప్రతి ఆడపిల్ల జీవితంలో సంభవించే ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఈ ప్రకృతి ధర్మాన్ని అవమానకర విషయంగా, దాన్ని దాచి ఉంచాలనే ధోరణిలో చాలామంది మహిళలు భావిస్తారు. తమ పిల్లలకు కూడా అదే నేర్పిస్తారు. కానీ.. అదొక రిప్రొడక్టివ్‌ ఇష్యూ అని, ఆ సమయంలో శుభ్రత ఎలా పాటించాలో నేర్పాలి. అవగాహన కల్పించాలని తెలుసుకోరు. దీన్ని సైన్స్, ఆరోగ్యానికి సంబంధించిన అంశంగా ఆడపిల్లలకి వివరించి చెప్పరు. అయితే.. ఇటీవలి కాలంలో పీరియడ్స్ విషయంలో అమ్మాయిల, మహిళ అభిప్రాయాలు మారుతున్నాయి. అవసరమైన సమయంలో దాని గురించి బహిరంగంగా మాట్లాడటానికి సందేహించట్లేదు. అలాగే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పీరియడ్స్ విషయంలో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి.


ఈ తరుణంలో పీరియడ్స్‌పై అవగాహన కల్సించేందుకు పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ (PURE) అనే సంస్థ ‘ప్యూరథాన్-2022’ నిర్వహించనుంది. ‘పీరియడ్ పోవర్టీ రన్ ఈవెంట్’గా అక్టోబర్ 9న ఉదయం 6.30 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ విలేకరుల సమావేశం నిర్వహించి పోస్టర్ విడుదల చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూతురు(Chiranjeevi Daughter), స్టైలిస్ట్ సుస్మిత (Sushmita) పాల్గొంది. ఈ సందర్భంగా పీరియడ్స్ గురించి మహిళలు ధైర్యంగా మాట్లాడాలని సుస్మిత చెప్పుకొచ్చింది.


ఈవెంట్‌లో సుస్మిత మాట్లాడుతూ.. ‘ఇలాంటి కార్యక్రమంలో  భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. పీరియడ్స్ అనేవి మహిళ శరీర అభివృద్ధికు ఉపయోగపడే ఓ విషయం. అలాంటి విషయం గురించి అవగాహన కల్పించడానికి చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. అది గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని మనందరం కచ్చితంగా ఒప్పుకుని.. ఆ అపోహలను తొలగించడానికి అందరూ ఇలా కలిసి రావడం ఆనందంగా ఉంది. అయితే.. ఇప్పటికీ పీరియడ్స్ గురించి మాట్లాడటానికి చాలా కుటుంబాల్లో మహిళలు ఇబ్బంది పడతారు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమందికి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ఎంతోమంది అమ్మాయిలు భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. అలాంటి వారి కోసం ఇలాంటి అపోహలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ.. ఇలాంటి మంచి విషయానికి సపోర్టు చేయడానికి మగవాళ్లు కూడా రావడం గొప్ప విషయం’ అని చెప్పింది.



Updated Date - 2022-09-29T18:51:47+05:30 IST