103 జ్వరంతో డాన్స్‌ చేశా: చిరంజీవి

ABN , First Publish Date - 2022-05-01T23:40:05+05:30 IST

‘‘కరోనా సమయంలో సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, వ్యాక్సినేషన్‌ ఇవ్వడం నా బాధ్యతగా భావించాను. సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావాల్సిన నేను అండగా ఉంటాను. మీ చిరంజీవి ఎప్పుడూ కార్మికుడే’’ అని చిరంజీవి అన్నారు. మేడే సందర్భంగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు చేసిన సినీ కార్మికోత్సవం యూసఫ్‌గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

103 జ్వరంతో డాన్స్‌ చేశా: చిరంజీవి

‘‘కరోనా సమయంలో సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, వ్యాక్సినేషన్‌ ఇవ్వడం నా బాధ్యతగా భావించాను.  సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావాల్సిన నేను అండగా ఉంటాను. మీ చిరంజీవి ఎప్పుడూ కార్మికుడే’’ అని చిరంజీవి అన్నారు. మేడే సందర్భంగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు చేసిన  సినీ కార్మికోత్సవం  యూసఫ్‌గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండస్ర్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతో సహకరించారని చిరు తెలిపారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమ కోసం ఎంతో మంది ఆర్టిస్ట్‌లు త్యాగం చేశారని ఆయన అన్నారు. ‘‘కేబీ తిలక్‌, అల్లు రామలింగయ్య, నూతన ప్రసాద్‌ వంటి సీనియర్‌ నటులు గుండె నిండా విషాదం ఉన్న సమయంలో కూడా పరిశ్రమ కోసం పనిచేశారు. తల్లి చనిపోయిన తరుణంలో కూడా అల్లు రామలింగయ్యగారు షూటింగ్‌కు వెళ్లారు. ఆయన విషాదంలో ఉండి మనకు నవ్వులు పంచారు. ఇక నా విషయానికొస్తే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లో సాంగ్‌ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నాకు 103 జర్వం ఉంది. అలా బాధపడుతూనే శ్రీదేవితో కలిసి డ్యాన్స్‌ చేశా. షూటింగ్‌ తర్వాత 15రోజులు ఆస్పత్రిలో ఉన్నాను. ఇప్పుడు కూడా ‘గాడ్‌ పాధర్‌’ సినిమా కోసం ముంబై, హైదరాబాద్‌ తిరగాల్సి వస్తుంది. కాస్త సుస్తీగా ఉందని చెబితే షూటింగ్‌ ఆగిపోతుంది. అది నాకు నచ్చదు’’ అని చిరంజీవి అన్నారు. 


Updated Date - 2022-05-01T23:40:05+05:30 IST