ఆ యుగపురుషుడుకి ఇదే నా ఘన నివాళి: Chiranjeevi

ABN , First Publish Date - 2022-05-28T22:30:53+05:30 IST

నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ((Nandamuri Taraka Ramarao) శత జయంతి సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. 99వ జయంతిని

ఆ యుగపురుషుడుకి ఇదే నా ఘన నివాళి: Chiranjeevi

నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ((Nandamuri Taraka Ramarao) శత జయంతి సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. 99వ జయంతిని పూర్తి చేసుకుని.. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన.. ఆ మహానటుడిని తలుచుకుంటూ పలువురు నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) అయితే NTR జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించేలా ప్లాన్ చేసినట్లుగా ప్రకటించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి, తెలుగు సినిమాకి ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చిన మొట్టమొదటి లెజండరీ హీరో నందమూరి తారక రామారావు. కేవలం తెలుగు సినిమా కోసమే కాకుండా, తెలుగు ప్రజల కోసం ఏపీ రాజకీయాల్లోనూ ఏ ఒక్కరూ ఊహించని విధంగా మార్పులు తీసుకొచ్చి.. తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం రాత్రింబవళ్ళు శ్రమించి.. తెలుగు జాతి కీర్తికిరీటంగా నిలిచారు. అలాంటి మహానుభావుడికి ఇదే నా ఘన నివాళి అంటూ ఎన్టీఆర్‌ని చిరంజీవి స్మరించుకున్నారు.


‘‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగపురుషుడు, నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి  కీర్తి కిరీటం శ్రీ నందమూరి తారక రామారావుగారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి!  #100YearsOfNTR’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


‘‘భారతీయ సినిమాకి ఎంతో గర్వకారణమైన శ్రీ నందమూరి తారక రామారావుగారి జయంతి నేడు. సినిమా చూడటమే కాకుండా.. అందులో నటించాలనేలా ఎందరికో స్ఫూర్తి నింపిన ఆ లెజెండ్‌ని ఈ సందర్భంగా స్మరించుకుందాం’’ అంటూ మెగా పవర్ స్టార్ (mega power star) రామ్ చరణ్ (Ram Charan) ట్వీట్ చేశారు. 





Updated Date - 2022-05-28T22:30:53+05:30 IST