LaalSingh Chadda : స్టేజ్‌పై చిరు, ఆమిర్ పానీపూరీలు

ABN , First Publish Date - 2022-07-25T16:46:25+05:30 IST

ఇతర సినిమాల ప్రమోషన్స్ కోసం ఎవరైనా సహాయం అర్ధిస్తే కాదనడం లేదు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). అలాంటిది బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) లాంటివాడే హెల్ప్ అడిగితే కాదనగలరా? వెంటనే రంగంలోకి దిగిపోయారు.

LaalSingh Chadda : స్టేజ్‌పై చిరు, ఆమిర్ పానీపూరీలు

ఇతర సినిమాల ప్రమోషన్స్ కోసం ఎవరైనా సహాయం అర్ధిస్తే కాదనడం లేదు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). అలాంటిది బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) లాంటివాడే హెల్ప్ అడిగితే కాదనగలరా? వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఆమిర్‌ తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’ (Lalsingh Chadda) విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో ఆమిర్ ఖాన్ తో అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya) స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా తెలుగు విడుదల ప్రత్యేకతను సంతరించుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ (Forestgump) కు ఈ సినిమా అఫీషియల్ రీమేక్. ఆగస్ట్ 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్.. తెలుగు ప్రమోషన్స్ మీద బాగా దృష్టిపెట్టింది. చిరు ఈ సినిమాను సమర్పించేలా ఒప్పించారు. ఆదివారం చిరంజీవి, చైతూలతో కలిసి ఆమిర్ ఖాన్ హైదరాబాద్ లో మీడియాను కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చారు. 


ఈ ప్రమోషనల్ ఇంటరాక్షన్‌లో ఒక ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ఆమిర్ ఖాన్, చిరంజీవి, నాగచైతన్య కలిసి స్టేజ్‌పై పానీపూరీలు తినడం విశేషంగా మారింది. లాల్ సింగ్ చడ్డా ట్రైలర్‌లో ఆమిర్ ఖాన్ ట్రైన్‌లో కూర్చొని పానీ పూరీలు తినడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సీన్ ఆసక్తికరంగా అనిపించింది. అదే సీన్ ను లాల్ సింగ్ చడ్డా తెలుగు ప్రమోషన్స్ కోసం రీక్రియేట్ చేశారు. పానీపూరీలు తెప్పించి స్టేజ్ పైనే తిన్నారు. చైతూ తన పాటికి తాను పానీపూరీలు తింటుంటే.. చిరంజీవి, ఆమిర్ కాన్ ఒకరికొకరు తినిపించుకొని అభిమానుల్ని ఆకట్టుకున్నారు. దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


ఆమిర్ ఖాన్ సొంత నిర్మాణంలో ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ (Secret Superstar) ఫేమ్ అద్వైత్ చంద్ (Adwaith Chand) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో కరీనా కపూర్ (Kareena Kapoor) కథానాయికగా నటించింది. ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని వివిధ దశల్లో ఆవిష్కరించే చిత్రమిది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ పాత్రను టామ్ హాంక్స్ (Tom Hanks) చేయడం విశేషం. కొంతకాలంగా సరైన హిట్స్ లేని ఆమిర్ ఖాన్.. ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం ప్రమోషన్స్‌కు చిరు సహకారం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. 

Updated Date - 2022-07-25T16:46:25+05:30 IST