Chiranjeevi - Allu Arjun: మెగాస్టార్ తో మేనల్లుడి ఢీ! బన్నీ వర్సెస్ చిరు?

ABN , First Publish Date - 2022-08-27T19:24:52+05:30 IST

అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకి రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకి మధ్య ఈమధ్య సాంఘిక మాధ్యమాల్లో వాదోపవాదాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే.

Chiranjeevi - Allu Arjun: మెగాస్టార్ తో మేనల్లుడి ఢీ!  బన్నీ వర్సెస్ చిరు?

అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకి రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకి మధ్య ఈమధ్య సాంఘిక మాధ్యమాల్లో వాదోపవాదాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. కొడుకు రామ్ చరణ్- మేనల్లుడు అర్జున్ లలో  మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి అసలైన సినీ వారసుడు ఎవ్వరన్న ప్రశ్న చుట్టూ రేగిన వివాదం అది. అదలా ఉండగా, తాజాగా అల్లు అర్జున్ ఏమాత్రం ‘తగ్గేదెలా’ అన్నట్టు మెగాస్టార్ చిరంజీవికి తానే రీప్లేస్మెంట్ అని అంటున్నట్టుగా చిత్రసీమలో టాక్. ఈమధ్య జరిగిన ఆయన సినిమా ‘పుష్ప’ రెండో భాగం పూజ జరిగిన తీరే అందుకు నిదర్శనం అనవచ్చు. మెగాస్టార్ పుట్టినరోజుకి ఇండియాలో లేకుండా అల్లు అర్జున్ అమెరికాలో కార్యక్రమం ఉందని వెళ్ళాడు, అక్కడ పాల్గొన్నాడు. 


అక్కడ పుష్ప నిర్మాత నవీన్ కూడా వున్నాడు. అర్జున్ తో పాటు హీరో, నిర్మాత లేకుండా ఇక్కడ ఇండియాలో పుష్ప రెండో భాగం పూజ కరెక్ట్ గా మెగాస్టార్ పుట్టిన రోజే జరిగింది. ముహుర్తాలు ఇంకా వున్నా కూడా, అదే రోజు పెట్టడం సందేహాలకు తావిస్తోందని పరిశ్రమలో పలువురు అనుకుంటున్నారు. అర్జున్ ఇది కావాలనే చేసాడని, అందుకే చిరంజీవి పుట్టిన రోజున తన సినిమా పూజ, తాను మరియు నిర్మాత ఒకరు తన వెంటే అమెరికాలో వున్నా కూడా చేయించాడని చెపుతున్నారు. ఎందుకంటే, చిరంజీవి పుట్టినరోజు నాడే తన సినిమా పూజాకార్యక్రమం, తాను వార్తల్లో ఉండాలని అనుకున్నాడట. ముందు రోజే, అమెరికాలో పాల్గొన్న ఈవెంట్ ఫోటోస్ కుడా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. 


ఇవన్నీ గమనిస్తున్న సినీ వర్గాలు- అల్లు అర్జున్ నేరుగా చిరంజీవితో పోటీ ఉన్నట్టు బాహాటంగానే తెలిసేలా చేస్తున్నాడు అని పరిశ్రమలో వినిపిస్తోంది. అదీ కాకుండా, ‘పుష్ప’ మొదటి భాగం విజయవంతమై, విపరీతమయిన అభిమానం, డబ్బు, పేరు అర్జున్ కి తీసుకు వచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచీ ఆయన గురించి మాట్లాడుకున్నారు. వీటన్నిటికీ తోడు చిరంజీవి సినిమా ‘ఆచార్య’ ఘోర పరాజయం పాలు కావడం కూడా అల్లు అర్జున్ కి బాగా కలిసొచ్చింది. అందువల్ల తాను మెగాస్టార్ కి తీసిపోనని నిరూపించుకోవడానికి బన్నీ ఇదంతా చేస్తున్నట్టు కనిపిస్తోందని, కాబట్టి ఇక మీదట చిరు వెర్సస్ బన్నీ ఉండొచ్చు అని అంటున్నారు.

Updated Date - 2022-08-27T19:24:52+05:30 IST