‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , First Publish Date - 2021-10-10T02:32:26+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య‌’. ఈ చిత్ర విడుదల

‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య‌’. ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తమ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా విడుదల తేదీని ప్రకటిస్తూ.. ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం 04, ఫిబ్రవరి 2022న భారీగా థియేటర్లలో విడుదలకానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కాగా, ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.



Updated Date - 2021-10-10T02:32:26+05:30 IST