Chiranjeevi: జనసేనకి ‘సైలెంట్‌’గానే సపోర్ట్!

ABN , First Publish Date - 2022-10-04T20:28:19+05:30 IST

‘‘నేనొక పక్క, తనొక పక్క ఉండటం కంటే.. నేను పాలిటిక్స్‌ నుంచి ఎగ్జిటై.. సైలెంట్‌గా ఉండటమే తమ్ముడికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను..’’ అని..

Chiranjeevi: జనసేనకి ‘సైలెంట్‌’గానే సపోర్ట్!

‘‘నేనొక పక్క, తనొక పక్క ఉండటం కంటే.. నేను పాలిటిక్స్‌ నుంచి ఎగ్జిటై.. సైలెంట్‌గా ఉండటమే తమ్ముడికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను..’’ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). అక్టోబర్ 5వ తేదీన ఆయన నటించిన ‘గాడ్‌ఫాదర్’ (God Father) చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ మొత్తం హాజరైంది. ఈ కార్యక్రమంలో.. తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన జనసేన పార్టీ (Janasena party)కి మీ మద్దతు ఉంటున్నట్లుగా గతంలో ప్రకటించారు.. ఇప్పటికీ ఆ మాటపైనా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానమిచ్చారు. 


ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ ‘నేను పాలిటిక్స్ నుంచి ఎగ్జిటై.. సైలెంట్‌గా ఉండటమే.. మా తమ్ముడికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను..’ ఇలా అని ఉంటానేమో తెలియదు నాకు. నా మద్దతు నా తమ్ముడికి అని స్ట్రాంగ్‌గా అని నేనెక్కడా మాట్లాడలేదు. భవిష్యత్‌లో చేస్తానేమో తెలియదు.. అతను నా తమ్ముడు. నా తమ్ముడులోని నిబద్ధత, నిజాయితీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎక్కడా పొల్యూట్ కాలేదు.. అంతటి నిబద్ధత ఉన్న నాయకులు మనకు రావాలి. వాడు ఏ పక్షాన ఉంటాడు.. ఎటుంటాడు, ఎలా ఉంటాడనేది.. భవిష్యత్‌లో ప్రజలు నిర్ణయిస్తారు. అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష. దానికి ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది. నేనొక పక్కన, తనొక పక్కన ఉండటం కంటే.. నేను విత్‌ డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవడంతో అతను పైపైకి వస్తాడు.. భవిష్యత్‌లో మంచి నాయకుడు అవుతాడు. ఏమో.. ఏలే అవకాశం ప్రజలు ఇస్తారేమో.. అని నేను భావిస్తాను.. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను..’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. 



Updated Date - 2022-10-04T20:28:19+05:30 IST