God Father : టూర్ ముగిసిన తర్వాత డాన్స్ చేయనున్న మెగాస్టార్

ABN , First Publish Date - 2022-05-26T18:04:38+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మోహన్ రాజా (Mohanraja) కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (God Father) మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ (Lucifer) చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో కీలకమైన పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన షెడ్యూల్ లో సల్మాన్ పాల్గొనడం తెలిసిందే.

God Father  : టూర్ ముగిసిన తర్వాత డాన్స్ చేయనున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మోహన్ రాజా (Mohanraja) కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (God Father) మలయాళ సూపర్ హిట్  ‘లూసిఫర్’ (Lucifer) చిత్రానికిది అఫీషియల్  రీమేక్ అన్న సంగతి తెలిసిందే.  ఇందులో కీలకమైన పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన షెడ్యూల్ లో సల్మాన్ పాల్గొనడం తెలిసిందే. ముంబైలో జరిగిన షూటింగ్ లో చిరంజీవి, సల్మాన్ పలు కీలక సన్నివేశాల్లో నటించారు. ఈ సినిమాలో ఇద్దరూ కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుండగా, ప్రభుదేవా (Prabhu Deva) ఈ సాంగ్‌కి కొరియోగ్రఫీ అందించబోతున్నాడు. 


ఈ పాటకి ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) స్పెషల్ బాణీలు అందించాడు. జూన్ నెల మొదటి వారంలో ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కానుందట. ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) ఫారిన్ ట్రిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. చిరు టూర్  ముగించుకున్న వెంటనే ‘గాడ్‌ఫాదర్’ (God Father) షూటింగ్‌ను ఈ సాంగ్‌‌తో మొదలు పెట్టనున్నట్లు ఇండస్ట్రీ‌లో టాక్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ (Salmankhan) నటిస్తుండటంతో ఈ సినిమా హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో హీరోయిన్ నయనతార నటిస్తుండగా.. మరో కీలక పాత్రను సత్యదేవ్ చేస్తున్నాడు. 

Updated Date - 2022-05-26T18:04:38+05:30 IST