Bhediya: ప్రేమికులకు ‘చిలిపి వరం’

ABN , First Publish Date - 2022-11-07T22:46:19+05:30 IST

రీసెంట్‌గా కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara)ను తెలుగులో విడుదల చేసి.. మంచి హిట్ అందుకున్న మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind).. తన ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’లో..

Bhediya: ప్రేమికులకు ‘చిలిపి వరం’

రీసెంట్‌గా కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara)ను తెలుగులో విడుదల చేసి.. మంచి హిట్ అందుకున్న మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind).. తన ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’లో మరోసారి తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ మూవీ ‘భేదియా’ (Bhediya)ను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. వరుణ్ ధావన్ (Varun Dhawan), కృతిసనన్ (Kriti Sanon) జంటగా నటించిన హారర్-కామెడీ చిత్రం ‘భేదియా’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘తుమ్కేశ్వరి’ (Thumkeshwari) సాంగ్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ‘చిలిపి వరాలే ఇవ్వు’ (Chilipi Varaale Ivvu) అనే వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం ఇది అనేలా ఈ పాట ఉంది. పాటలో వరుణ్, కృతిసనన్‌ల కెమిస్ట్రీ కూడా చూడచక్కగా.. మంచి ఫీల్‌ను క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.  


ఈ చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ‘చిలిపి వరాలే ఇవ్వు’  పాటను కార్తీక్ ఆలపించగా.. అమితాబ్ భట్టాచార్య & యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు. కాగా, 2018 లో వచ్చిన ‘స్త్రీ’, 2021 లో వచ్చిన ‘రూహి’ తరువాత.. దినేష్ విజన్ యొక్క హారర్-కామెడీ యూనివర్స్‌లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘భేదియా’. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. హిందీ, తమిళం మరియు తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. (Chilipi Varaale Ivvu Video Song)



Updated Date - 2022-11-07T22:46:19+05:30 IST