సొంతూరు మేలు కోసం నటుడిగా మారిన యువకుడు

ABN , First Publish Date - 2022-03-16T01:17:39+05:30 IST

సొంతనేలకు మేలు చేయాలన్న పట్టుదలతో తెన్‌కాశికి చెందిన ఓ యువకుడు నటుడుగా మారి సినిమాల్లో రాణిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలతో రాష్ట్రంలోకి ప్రవేశించిన 20 లారీలను ధైర్యంగా అడ్డగించి, వాటిని తిరిగి కేరళకు

సొంతూరు మేలు కోసం నటుడిగా మారిన యువకుడు

సొంతనేలకు మేలు చేయాలన్న పట్టుదలతో తెన్‌కాశికి చెందిన ఓ యువకుడు నటుడుగా మారి సినిమాల్లో రాణిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలతో రాష్ట్రంలోకి ప్రవేశించిన 20 లారీలను ధైర్యంగా అడ్డగించి, వాటిని తిరిగి కేరళకు పంపించి గ్రామ ప్రజల్లో హీరోగా నిలిచాడు. అంతేకాకుండా, తన గ్రామంతో పాటు పర్యావరణానికి మేలు చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఆ యువ నటుడు పేరు చిదంబరం. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలి నాళ్ళలోనే ‘కర్ణన్‌’, ‘రుద్రతాండవం’ వంటి చిత్రాల్లో నటించి, ప్రతి ఒక్కరితో శభాష్‌ అనిపించుకున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసి కుట్రాలంలోని ఒక స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం చేసేవాడు.. అదేసమయంలో తెన్‌కాశి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగారు. 


ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణపై ఎంతో ఆసక్తి చూపించే చిదంబరం కేరళ నుంచి వివిధ రకాల వ్యర్థాలను తమిళనాడులోకి తరలిస్తున్నారన్న విషయాన్ని పసిగట్టి, రాష్ట్రంలోకి ప్రవేశించిన 20 లారీలను తిరిగి కేరళకు పంపించి ప్రతి ఒక్కరి అభినందనలు పొందారు. ఇపుడు ఒక వెబ్‌ సిరీస్‌తో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు. రాజు మురుగన్‌ దర్శకత్వంలో హీరో కార్తీ నటించే చిత్రంలో చిదంబరం ఓ ప్రధాన పాత్ర పోషించనున్నారు. అలాగే, పర్యావరణ పరిరక్షణ ద్వారా తన సొంత గ్రామానికి, గ్రామవాసుల్లో అవగాహన కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు నటుడు చిదంబరం తెలిపారు. 

Updated Date - 2022-03-16T01:17:39+05:30 IST