Chhavi Mittal : ఎద నిండుగా ధైర్యంతో... Breast Cancer ని జయిస్తోన్న బాలీవుడ్ నటి...

ABN , First Publish Date - 2022-05-03T03:20:59+05:30 IST

క్యాన్సర్ అన్న పదం వింటేనే ఎవరైనా వణికిపోతారు. అటువంటి భయం కలిగించే దారుణమైన వ్యాధి అది. అయినా కూడా రోజురోజుకు క్యాన్సర్ తో పోరాడి గెలుస్తోన్న సర్వైవర్స్ ఎక్కువవుతూనే ఉన్నారు. అదే కాస్త సంతోషకరమైన పరిణామం. ఇక సినిమా, టీవీ రంగాల్లో క్యాన్సర్ బాధితులు కొత్తేం కాదు. ఈ మధ్య కాలంలో సోనాలి బెంద్రే, సంజయ్ దత్ లాంటి వారు మహమ్మారిని జయిస్తే రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి వారు క్యాన్సర్ పోరులో నేలకొరిగారు. తాజాగా మరో నటి cancerతో సంగ్రామానికి సర్వశక్తులూ ఒడ్డుతూ సంసిద్ధమవుతోంది. ఆమే... ఛవీ మిట్టల్...

Chhavi Mittal హిందీ సీరియల్స్ తో పాటూ కొన్ని సినిమాల్లోనూ కనిపించిన టాలెంటెడ్ యాక్ట్రస్. దర్శకుడు మోహిత్ హుస్సేన్ ను పెళ్లాడిన ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే, 41 ఏళ్ల ఛవీకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టుగా తేలింది. కానీ, ఎంత మాత్రం మానసిక స్థైర్యం కోల్పోని స్ట్రాంగ్ లేడీ ఏప్రెల్ 25, 2022న సర్జరీ చేయించుకుంది. 6 గంటల పాటూ సాగిన శస్త్ర చికిత్స తరువాత ఆమె విజయవంతంగా హాస్పిటల్ నుంచీ ఇంటికి చేరుకుంది. కానీ, ఇంకా బలహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఛవీ తన తాజా ఇన్ స్టా పోస్టులో ఫాలోయర్స్ కి ప్రేరణ కలిగించేలా కొన్ని మాటలు చెప్పింది. 

తన బెస్ట్ ఫ్రెండ్ తో కలసి కాస్సేపు వాకింగ్ చేసి వచ్చానని రాసుకొచ్చిన ఛవీ... తనని తాను ‘normal’గా ఫీలయ్యేందుకు ఏ పనైనేతే ఉపయోగపడుతుందో... అది తప్పక చేస్తున్నానని వివరించింది. తాను మామూలు స్థితికి రావటానికి మరో నెల సమయం పడుతుందని కూడా ఆమె నెటిజన్స్ కు చెప్పింది. అయితే, Chhavi Mittal క్యాన్సర్ పోరు అప్పుడే పూర్తిగా అయిపోలేదు. సర్జరీ తరువాత కీమోథెరపీగానీ, రేడియషన్ ట్రీట్మెంట్ గానీ కొనసాగనుందట. వాటి కోసం ఇప్పట్నుంచే మానసికంగా సిద్ధపడుతోంది బాలీవుడ్ నటి. అంతే కాదు, cancer మన మౌన వేదనకి కారణం కాకూడదని తను పిలుపునిచ్చింది. క్యాన్సర్ బాధితులు విచారంగా, దు:ఖిస్తూ కూర్చోవద్దన్న ఛవీ... జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించేందుకు క్యాన్సరే కారణం కావాలంటోంది!     

Updated Date - 2022-05-03T03:20:59+05:30 IST