Chennakesava Reddy: అక్కడ కూడా బాలకృష్ణ సందడే!

ABN , First Publish Date - 2022-09-27T03:12:51+05:30 IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్‌ దర్శకుడు వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయింది. ఫ్యాక్షనిజం కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేశ్‌ నిర్మించారు.

Chennakesava Reddy: అక్కడ కూడా బాలకృష్ణ సందడే!

నందమూరి బాలకృష్ణ (Balakrishna)హీరోగా, మాస్‌ దర్శకుడు వి.వి.వినాయక్‌ (V V Vinayak)దర్శకత్వం వహించిన ‘చెన్నకేశవరెడ్డి’ (Chennakesava reddy) విడుదలై 20 ఏళ్లు (20 years)పూర్తయింది. ఫ్యాక్షనిజం కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేశ్‌ నిర్మించారు. సెప్టెంబర్‌ 25, 2002న విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అభిమానుల కోసం ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్‌ చేశారు నిర్మాత. రీ రిలీజ్‌లోనూ ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. బాలయ్య అభిమానుల్లో జోష్‌ నింపింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా అభిమానులు సత్తా చాటారు. అక్కడ కూడా బాలయ్య డైలాగ్‌లకు థియేటర్లు దద్దరిల్లాయి. జై బాలయ్య అంటూ థియేటర్ల బయట సందడి చేశారు. తాజాగా తమిళనాడులో ఓ థియేటర్‌ దగ్గర  అభిమానులు సందడి చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. కుర్రకారుతో కలిసి ఓ పెద్దాయన థియేటర్‌లో ‘హాయి హాయి హాయి.. నువ్వు నాకు నచ్చావోయి’ పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. తమిళనాడులో బాలయ్య ఫ్యాన్స్‌ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్ల దగ్గర కూడా అభిమానులు సందడి చేశారు. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబట్టింది. 





Updated Date - 2022-09-27T03:12:51+05:30 IST