విజయ్ సేతుపతి పాటకు చిందులేసిన చెన్నై టీం సభ్యులు

ABN , First Publish Date - 2022-04-24T21:22:29+05:30 IST

ఇండియన్ ప్రీమీయర్ లీగ్ టీం(ఐపీఎల్) చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సభ్యులు ఓ తమిళ పాటకు డ్యాన్సులేశారు. ‘టు టు టు’ అనే సాంగ్‌కు స్టెప్పులేశారు.

విజయ్ సేతుపతి పాటకు చిందులేసిన చెన్నై టీం సభ్యులు

ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (ఐపీఎల్) టీం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సభ్యులు ఓ తమిళ పాటకు డ్యాన్సులేశారు. ‘టు టు టు’ అనే సాంగ్‌కు స్టెప్పులేశారు. ఈ పాట విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన ‘కాతు వక్కుల రెండు కాదల్’ సినిమాలోనిది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరో, హీరోయిన్లుగా నటించారు. 


న్యూజిలాండ్ బ్యాట్‌మెన్ అయిన డెవాన్‌ కాన్వే ఐపీఎల్‌లో చెన్నై టీంకు ఆడుతున్నాడు. తాజాగా అతడి పెళ్లి  జరిగింది. ఈ వేడుకలోనే సీఎస్‌కే సభ్యులు ‘టు టు టు’ పాటకు చిందు లేశారు. రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో అందరికంటే హుషారుగా కాలు కదపారు. ధోనీ ఇతర సభ్యులతో కలసి భుజాలెగేరుస్తూ కనిపించాడు. ఈ వీడియోను సీఎస్‌కే టీం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పోస్ట్‌ను సమంత ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ద బెస్ట్ అని రాసింది. ‘కాతు వక్కుల రెండు కాదల్’ రొమాంటిక్ ఎంటర్‌‌‌టైనర్‌గా రూపొందింది. ఈ మూవీని తెలుగులో ‘కణ్మణి రాంబో ఖతీజా’ పేరుతో డబ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతుంది



Updated Date - 2022-04-24T21:22:29+05:30 IST