టెలివిజన్ షోలో అతిథి పాత్రలో మెరవనున్న బ్రిటన్ రాజదంపతులు

ABN , First Publish Date - 2022-05-24T01:02:24+05:30 IST

బ్రిటన్‌లో అత్యధిక కాలం నుంచి కొనసాగుతోన్న టీవీ షో ‘ఈస్ట్‌ఎండర్స్’ (EastEnders). ఈ టెలివిజన్ షోలో బ్రిటన్ రాజదంపతులు చార్లెస్(Charles), ఆయన భార్య కెమిల్లా(Camilla) కనిపించబోతున్నారు. క్వీన్

టెలివిజన్ షోలో అతిథి పాత్రలో మెరవనున్న బ్రిటన్ రాజదంపతులు

బ్రిటన్‌లో అత్యధిక కాలం నుంచి కొనసాగుతోన్న టీవీ షో ‘ఈస్ట్‌ఎండర్స్’ (EastEnders). ఈ టెలివిజన్ షోలో బ్రిటన్ రాజదంపతులు చార్లెస్(Charles), ఆయన భార్య కెమిల్లా(Camilla) కనిపించబోతున్నారు. క్వీన్ ఎలిజబెత్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ షోలో రాజవంశీకులు పాల్గొన్నారు. ‘ఈస్ట్‌ఎండర్స్’లోని ఓ ఎపిసోడ్ కోసం లండన్ సెట్‌ను వేశారు. మార్చిలో ఈ సెట్‌కు వచ్చి రాజదంపతులు షూటింగ్‌లో పాల్గొన్నారు. టెలివిజన్ షోలో అతిథి పాత్రలో మెరవనున్నారు. స్ట్రీట్ పార్టీ సీన్‌లో కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్ జూన్ 2న ప్రసారం కాబోతుంది. 


‘ఈస్ట్‌ఎండర్స్’ లో కీలక పాత్రను పోషించే కెల్లీ బ్రైట్ రాజదంపతులకు ఇతర తారాగణన్ని పరిచయం చేశారు. ‘‘చార్లెస్, కెమిల్లా ఇంతకుముదెప్పుడు ఇలా చేయలేదు. ఇలా టీవీషోలో గతంలో కనిపించలేదు. అయినప్పటికీ ఈ షోలో నటించారు. మేం ఏవిధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నామో, వారు కూడా అదేవిధంగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం’’ అని కెల్లీ తెలిపింది. ‘‘చార్లెస్, కెమిల్లా ‘ఈస్ట్‌ఎండర్స్’ స్పెషల్ ఎపిసోడ్‌లోనటించడం చాలా సంతోషంగా ఉంది’’ అని షో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్రిస్ క్లెన్షా చెప్పారు. రాజకుటుంబానికి చెందినవారు ‘ఈస్ట్‌ఎండర్స్’ షోలో పాల్గొనడం మొదటిసారేం కాదు. క్వీన్ ఎలిజబెత్ 2001లో పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఓ ఎపిసోడ్‌లో కనిపించారు.  

Updated Date - 2022-05-24T01:02:24+05:30 IST