‘Chandramukhi 2’: ఇంతమంది హీరోయిన్‌లా..?

ABN , First Publish Date - 2022-07-26T18:51:52+05:30 IST

రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి ’. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్ నటించబోతున్నారట. 2005లో విడుదలయిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

‘Chandramukhi 2’: ఇంతమంది హీరోయిన్‌లా..?

రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి ’. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్ నటించబోతున్నారట. 2005లో విడుదలయిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత చంద్రముఖికి సీక్వెల్‌ రూపొందుతోంది. చంద్ర‌ముఖి 2 (Chandramukhi 2)ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) భారీ స్థాయిలో నిర్మించనున్నారు. పి వాసు (P.Vasu) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఆ సమయంలో రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. ఇక ఈ మూవీలో ప్రముఖ హాస్య నటుడు వడివేలు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మేయిన్ హీరోయిన్‌గా లక్ష్మీ మేనన్‌ను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం మేరకు ఇందులో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉంటారట. వారిలో మహిమా నంబిరాయర్‌ను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేశారు.


అంతేకాదు, ప్రస్తుతం ఈమె మైసూరులో జరుగుతున్న షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. ఇక మిగిలిన నలుగురు హీరోయిన్లు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇంతకముందు లారెన్స్ నుంచి వచ్చిన కామెడి హర్రర్ చిత్రాలు ముని, కాంచన, కాంచన 2, గంగ, కాంచన 3 భారీ హిట్ సాధించాయి. ఈ క్రమంలో ఇప్పుడు రూపొందుతున్న చంద్రముఖి 2 ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.  

Updated Date - 2022-07-26T18:51:52+05:30 IST