అభిమానులకు హీరో రమేశ్‌ అరవింద్‌ వినూత్న అవకాశం

ABN , First Publish Date - 2022-09-10T18:21:49+05:30 IST

చందనసీమలో ప్రముఖ నటుడు రమేశ్‌ అరవింద్‌(Ramesh Aravind) తన అభిమానులకు అపురూప అవకాశం కల్పిం చారు. శనివారం

అభిమానులకు హీరో రమేశ్‌ అరవింద్‌ వినూత్న అవకాశం

బెంగళూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): చందనసీమలో ప్రముఖ నటుడు రమేశ్‌ అరవింద్‌(Ramesh Aravind) తన అభిమానులకు అపురూప అవకాశం కల్పించారు. శనివారం తన పుట్టిన రోజు వేడుక సందర్భంగా అభిమానులు ఆయన వాట్సాప్‌(Whatsapp) నెంబర్లకు పేరు వివరాలతో మెసేజ్‌ చేసి శుభాకాంక్షలు తెలిపితే ప్రతి ఒక్కరికీ వాయిస్‌ మెసేజ్‌ ధ్వారా రమేష్‌ అరవింద్‌ స్పందించనున్నారు. అంతేకాకుండా ఉత్తమ శుభాకాంక్షల సందేశం పంపిన అభిమానులకు నేరుగా ఫోన్‌చేసి రమేష్‌ అరవింద్‌ మాట్లాడతారు. ఈ మేరకు రమేష్‌ అరవింద్‌ కార్యాలయం నగరంలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించదల్చుకునే అభిమానులు 89515 99009, 89516 99009 అనే నెంబర్లకు సందేశాలను పంపుకోవాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్‌ నెంబర్లకు వచ్చే ప్రతి సందేశాన్ని నటుడు అరవింద్‌ చూసి స్పందిస్తారని ప్రకటన పేర్కొంది.


Updated Date - 2022-09-10T18:21:49+05:30 IST