Sree Vishnu Alluri: అల్లూరి సినిమాలో 7 నిముషాల సీన్ కట్

Twitter IconWatsapp IconFacebook Icon
Sree Vishnu Alluri: అల్లూరి సినిమాలో 7 నిముషాల సీన్ కట్

శ్రీ విష్ణు (Sree Vishnu) ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమా 'అల్లూరి' (Alluri). ఇందులో అతని పేరు అల్లూరి సీతారామ రాజు (Alluri Seetharama Raju). ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కి పంపినప్పుడు అందులో ఒక సీన్ మొత్తం తీసేయాలని సెన్సార్ సభ్యులు (Censor Board) సూచించారని ఒక సమాచారం ద్వారా తెలిసింది. ఈ సినిమా కథ 1990 దశకం లో వుమ్మడి ఆంద్ర ప్రదేశ్ (Andhra Pradesh) లో జరిగింది. ఒక సీన్ లో పోలీస్ అయిన అల్లూరి ని నక్సల్స్ (Naxals) కిడ్నాప్ (Kidnap) చేసి టార్చర్ (Torture) చెయ్యడం మరీ హింసగా వుంది అని, ఆ సీన్ మొత్తం తీయాలని సెన్సార్ సభ్యులు సూచించి నట్టు తెలిసింది. చిత్ర దర్శకుడు, నిర్మాత ఆ సినిమాకి అదే చాల ముఖ్యం అని, సెన్సార్ సభ్యులు ఆలోచించాలని విజ్ఞప్తి చేసారని కూడా తెలిసింది. కానీ సెన్సార్ సభ్యులు ఆ సన్నివేశం లో చాల హింస ఉందని, అది సెన్సార్ నిభందనలు విరుద్ధంగా ఉండటంతో ఆ సన్నివేశాన్ని తొలగించాలని చెప్పారని కూడా తెలిసింది. ఆ సన్నివేశం మొత్తం ఏడు నిముషాల పాటు ఉంటుందని కూడా తెలిసింది. అయితే అల్లూరి సినిమా చాల బాగా ఉందని, శ్రీ విష్ణు మరోసారి తన నటనతో  ఆకట్టుకుంటాడని,సెన్సార్  రిపోర్ట్ ద్వారా తెలిసింది. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.