Vikram: సెన్సార్ పూర్తి.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల

ABN , First Publish Date - 2022-05-26T21:57:33+05:30 IST

లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan), లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ (Vikram). ఇటీవల దళపతి విజయ్‌తో ‘మాస్టర్’ ( Master) చిత్రం తీసి లోకేష్ భారీ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Vikram: సెన్సార్ పూర్తి.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల

లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan), లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ (Vikram). ఇటీవల దళపతి విజయ్‌తో ‘మాస్టర్’ ( Master) చిత్రం తీసి లోకేష్  భారీ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది.  ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 400+ థియేటర్లలో శ్రేష్ట్  మూవీస్  ద్వారా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. 


ఇందులో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్  ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.ఇక ఇందులో మరో స్టార్ హీరో సూర్య (Surya) పవర్ ఫుల్ గెస్ట్ రోల్‌తో అలరించబోతున్నారు. ఇప్పటికే  ట్రైలర్‌తో ప్రమోషన్‌ల జోరు పెంచారు. ఇదిలావుండగా నితిన్ తండ్రి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, కమల్ హాసన్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా ‘విక్రమ్’ తెలుగు పోస్టర్‌ను కమల్ హాసన్‌కి అందించారు. తెలుగులో ప్రమోషన్ స్ట్రాటజీ గురించి చర్చించారు. కమల్ హాసన్ తో పాటు చిత్ర యూనిట్ తో తెలుగులో గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. 



Updated Date - 2022-05-26T21:57:33+05:30 IST