విఘ్నేశ్ శివన్‌తో త్వరలో నయనతార పెళ్లి..?

ABN , First Publish Date - 2022-04-24T23:25:24+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను మైమరిపించే నటి నయనతార. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకునే తారామణుల్లో ఆమె ఒకరు.

విఘ్నేశ్ శివన్‌తో త్వరలో నయనతార పెళ్లి..?

అందం, అభినయంతో ప్రేక్షకులను మైమరిపించే నటి నయనతార. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకునే తారామణుల్లో ఆమె ఒకరు. స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో నయన్ గత ఆరేళ్లుగా డేటింగ్ చేస్తోంది. ఈ జంట కొన్నేళ్ల క్రితమే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి నయన్ అభిమానులు ఆమె ఎప్పుడు పెళ్లి కబురు వినిపిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 


ఈ సెలబ్రిటీ లవ్ బర్డ్స్ త్వరలోనే తీపి కబురును వినిపించనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారని సమాచారం. కేరళ లేదా విదేశాల్లో ఈ వివాహం జరగనుందని ఈ జంటతో సన్నిహితంగా మెలిగేవారు తెలుపుతున్నారు. పెళ్లి జరిగే తేదీకి వారం రోజుల మందు కార్యక్రమాలను మొదటుపెట్టనున్నారట. అనంతరం భారీ స్థాయిలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రిసెప్షన్‌కు ఇండస్ట్రీ మిత్రులు, రాజకీయ నాయకులను ఆహ్వానించబోతున్నారని వినికిడి.  ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరో, హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 28న ఈ మూవీ విడుదల కాబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో విఘ్నేశ్ శివన్ ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ను మొదలుపెట్టక ముందే నయన్‌తో పెళ్లి పీటలను ఎక్కాలని విఘ్నేశ్ భావిస్తున్నాడట.



Updated Date - 2022-04-24T23:25:24+05:30 IST