అలియా- రణ్‌బీర్‌ లకు బంగారు కానుక

ABN , First Publish Date - 2022-04-13T23:31:01+05:30 IST

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారు. భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.

అలియా- రణ్‌బీర్‌ లకు బంగారు కానుక

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారు. భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ జంట ఏప్రిల్ రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. వివాహనికి సంబంధించిన పనులు ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. 


అలియా భట్, రణ్ బీర్ కపూర్‌ల మెహందీ ఫంక్షన్ ఏప్రిల్ 13న జరిగింది. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసం ‘వాస్తు’ లో ముందుగా వినాయకుడి పూజ చేశారు. అనతంరం రెండు గంటలకు మెహందీ ఫంక్షన్ మొదలైంది. ఈ ఫంక్షన్‌కు రణ్‌బీర్ కుటుంబ సభ్యులు కరిష్మా కపూర్, నీతూ కపూర్, రిద్దిమా కపూర్, కరీనా కపూర్, అదర్ జైన్, అర్మాన్ జైన్ తదితరులు హాజరయ్యారు. పెళ్లికి ముందు రణ్‌బీర్, అలియాలకు బంగారు కానుక అందింది. సూరత్‌కు చెందిన బంగారు నగల వ్యాపారి ఈ జంటకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్‌ను పంపించారు. బంగారు పూతతో కూడిన బోకేను బాహుమతిగా అందించారు. రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్ క్లబ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులందరూ ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. 


భద్రతా కారణాల రీత్యా అలియా భట్ ఏప్రిల్ 14న కాకుండా ఏప్రిల్ 20న పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలను అలియా భట్ సోదరుడు రాహుల్ భట్ ఖండించాడు. అవి పుకార్లని స్పష్టం చేశాడు. పెళ్లి తేదీలో ఎటువంటి మార్పు లేదని చెప్పాడు. ఏప్రిల్ 14నే వివాహం జరగుతుందని వివరించాడు. రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకునే తేదీని అలియా భట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఆ వివరాలను వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టనున్నట్టు సమాచారం. పెళ్లికి ముందు జరిగే సంబరాలకు గుర్తుగానే ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా’ పాటను విడుదల చేసినట్టు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 



Updated Date - 2022-04-13T23:31:01+05:30 IST