అలియా, రణ్‌బీర్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎక్కడ జరగబోతోందంటే..

ABN , First Publish Date - 2022-04-06T21:17:57+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ అలియా‌భట్- రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారు

అలియా, రణ్‌బీర్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎక్కడ జరగబోతోందంటే..

బాలీవుడ్ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ అలియా‌భట్- రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారు. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 16న అలియా భట్ వివాహం జరగబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ వేడుకకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్టు సమాచారం.


అలియా- రణ్‌బీర్‌ల పెళ్లికి సంబంధించిన హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఏప్రిల్ 13నుంచి 17మధ్య జరగబోతున్నట్టు తెలుస్తోంది. వీరి వివాహం రణ్ బీర్ పూర్వీకుల నివాసమైన ఆర్‌కేహౌస్‌లో జరగనుందని పుకార్లు షికార్లు కొట్టాయి. కానీ, ఆర్‌కేహౌస్‌లో అన్ని రకాల సదుపాయాలు లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారట. తాజాగా మరో ప్రదేశాన్ని ఎంపిక చేశారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసం ‘వాస్తు’లో వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. పెళ్లికి ముందు రణ్‌బీర్ బ్యాచిలర్ పార్టీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ పార్టీకి అతడి మిత్రులు అర్జున్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, అయాన్ ముఖర్జీ తదితరులు హాజరు కాబోతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఇక కెరీర విషయానికి వస్తే.. రణ్‌బీర్ నటించిన ‘షంషేరా’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోయే ‘యానిమల్’లోను అతడు నటించనున్నాడు. అలియా భట్ హాలీవుడ్ ప్రాజెక్టులో నటించబోతుంది.

Updated Date - 2022-04-06T21:17:57+05:30 IST