‘పుష్ప’ డైలాగ్‌ పేల్చిన మరో క్రికెటర్.. ట్వీట్ వైరల్

ABN , First Publish Date - 2022-01-09T00:48:56+05:30 IST

‘పుష్ప’ ప్రభంజనం ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. సినిమా చూసిన సెలబ్రిటీలెందరో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా వాళ్లే కాకుండా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మొదలుకుని.. భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా

‘పుష్ప’ డైలాగ్‌ పేల్చిన మరో క్రికెటర్.. ట్వీట్ వైరల్

‘పుష్ప’ ప్రభంజనం ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. సినిమా చూసిన సెలబ్రిటీలెందరో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా వాళ్లే కాకుండా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మొదలుకుని.. భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, హనుమ విహారి, అంబటి రాయుడు వంటి వారంతా.. ఈ సినిమాపై స్పందించారు. తాజాగా మరో భారత క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా.. సినిమాలోని ఓ డైలాగ్‌ కూడా పేల్చారు. 


‘‘ ‘పుష్ప.. ఐ హేట్ టియర్స్’ అనే బ్లాక్‌బస్టర్ డైలాగ్ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ‘పుష్ప.. పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదే లే’.. నిజంగా మీ నటనతో ఎంతో ఎంజాయ్ చేశాను అల్లు అర్జున్ గారు. పుష్ప సూపర్..’’ అంటూ ప్రగ్యాన్ ఓజా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో వైపు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల దంపతులు కూడా ‘పుష్ప’పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ ‘పుష్ప’ అంటే ఫైర్.. నీ నటన అద్భుతం అల్లు అర్జున్’’ అని గుత్తా జ్వాల ట్వీట్ చేయగా.. ‘‘పుష్ప ది రైజ్.. మైండ్ బ్లాస్ట్ పెర్ఫార్మెన్స్‌‌తో అలరించిన అల్లు అర్జున్‌కి అభినందనలు. చాలా సంతోషంగా ఉంది. టెక్నికల్‌గా కూడా ఈ చిత్రం అద్భుతంగా ఉంది. సుకుమార్‌గారి విజన్ ఎంతగానో నచ్చింది..’’ అని హీరో విష్ణు విశాల్ ట్వీట్ చేశారు.







Updated Date - 2022-01-09T00:48:56+05:30 IST