Hyderabadi Chai Adda: సినీ తారల నడుమ సందడిగా.. ప్రాంఛైజీ మేళా

ABN , First Publish Date - 2022-07-25T23:24:27+05:30 IST

యువ‌త‌ను ఎంటర్‌ప్రీనర్స్‌గా మార్చేందుకు నటుడు అభిన‌వ్ స‌ర్ధార్ (Abhinav Sardar) ఏర్పాటు చేసిన.. హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా (Hyderabadi Chai Adda) ప్రాంఛైజీ మేళాకు విశేష ఆదరణ..

Hyderabadi Chai Adda: సినీ తారల నడుమ సందడిగా.. ప్రాంఛైజీ మేళా

యువ‌త‌ను ఎంటర్‌ప్రీనర్స్‌గా మార్చేందుకు నటుడు అభిన‌వ్ స‌ర్ధార్ (Abhinav Sardar) ఏర్పాటు చేసిన.. హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా (Hyderabadi Chai Adda) ప్రాంఛైజీ మేళాకు విశేష ఆదరణ లభించింది. ఈ కార్యక్రమంలో చాలా మంది యువత పాల్గొన్నారు. వారితో పాటు సినీతారలెందరో ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గ‌జ‌ల్ శ్రీనివాస్ (Ghazal Srinivas).. ‘‘యువ‌త‌ను ఎంటర్‌ప్రీనర్స్‌‌గా మార్చేందుకు అభిన‌వ్ స‌ర్ధార్ చేస్తున్న కృషి అభినంద‌నీయ‌ం. నగరంలో నిర్వహించిన  హైద‌రాబాదీ ఛాయ్ అడ్డా ప్రాంఛైజీ మేళా‌కు ఇటువంటి స్పందన రావడం చూస్తుంటే.. యువత ఏం కోరుకుంటున్నారో అర్థమవుతుంది’’ అని అన్నారు. 


ఈ సందర్భంగా హైదరాబాదీ ఛాయ్ అడ్డా ఛైర్మన్ అభినవ్ సర్ధార్ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు. జాబ్ కన్నా.. సొంత వ్యాపారం చేయడం ఉత్తమమని భావిస్తున్నారు. కానీ పెట్టుబడి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఛాయ్ అడ్డా సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న యువతకి.. తక్కువ పెట్టుబడితోనే ప్రాంఛైజీ‌ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆసక్తి ఉన్నవారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను..’’ అని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సినీతారలంతా.. అభిన‌వ్ స‌ర్ధార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 

Updated Date - 2022-07-25T23:24:27+05:30 IST