Sandeep Kishan: సందీప్ కిషన్ తెలుగు పరిశ్రమ సెన్సేషనల్ ఐకాన్ అంట!

ABN , First Publish Date - 2022-09-18T19:35:59+05:30 IST

తమిళ యాక్టర్ ధనుష్ (Dhanush) చేస్తున్న పీరియడ్ డ్రామా ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో సందీప్ కిషన్‌ (Sandeep Kishan)ని కూడా తీసుకున్నారు...

Sandeep Kishan: సందీప్ కిషన్ తెలుగు పరిశ్రమ సెన్సేషనల్ ఐకాన్ అంట!

తమిళ యాక్టర్ ధనుష్ (Dhanush) చేస్తున్న పీరియడ్ డ్రామా ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో సందీప్ కిషన్‌ (Sandeep Kishan)ని కూడా తీసుకున్నారు. ఆ సినిమాలో అతను ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు అని సినిమా నిర్వాహకులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం తెలుగులో ప్రతి నటుడికి ఒక ప్రిఫిక్స్ ఇచ్చేస్తున్నారు. అది ఎవరు డిసైడ్  చేస్తారు, ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నది తెలీదు. ఆ ప్రిఫిక్స్ చూస్తుంటే ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా. టాలీవుడ్ ఇండస్ట్రీ సెన్సేషనల్ ఐకాన్ సందీప్ కిషన్ అని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 


అది చూశాక సందీప్ ఎప్పుడు అంత సెన్సేషన్ అయ్యాడు. ఏమి చేసాడు అని ఆలోచించాలి మనం. సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమాలో, మంచి సినిమాలు చేస్తున్నాడు అని అంటే ఒక అర్థం వుంది.  ధనుష్‌కి జాతీయ అవార్డు వచ్చింది, మంచి సినిమాల్లో నటించాడు, మంచి నటుడు అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. హిందీలో కూడా మంచి సినిమాలు చేశాడు. అటువంటి ధనుష్ సినిమాలో చేసేందుకు సందీప్ కిషన్‌కి ఒక ఛాన్స్ వచ్చింది. అంతే కానీ ధనుష్ సినిమాలో సందీప్ చెయ్యటం వల్ల ఆ సినిమాకి, ధనుష్‌కి ఒరిగేది ఏమి ఉండదు. అక్కడితో ఆగలేదు ఆ ప్రెస్ రిలీజ్‌లో, ‘మోస్ట్ ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ ప్రాజెక్ట్‌లోకి రావడం మరింత ఆకర్షణగా నిలిచింది’ అని అంటున్నారు. ఎవరు ఎవరికీ ఆకర్షణ, అర్థం కావటం లేదు. ఒక్కోసారి అతి చేసిన అర్థం ఉండాలి, మరీ ఇంత అతి పనికిరాదు. ఈ సినిమాకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు.

Updated Date - 2022-09-18T19:35:59+05:30 IST