Pop Singer Justin Bieber కు ఏమైంది..? ముఖం ఎందుకు ఇలా అయిపోతోందంటే..

ABN , First Publish Date - 2022-06-11T21:51:44+05:30 IST

కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (Justin Bieber) అనారోగ్యానికి గురయ్యాడు. అతడి ముఖానికి పక్షవాతం (Paralysis) వచ్చింది. రామ్సే హంట్ సిండ్రోమ్(Ramsay Hunt syndrome) కారణంగా కుడివైపు

Pop Singer Justin Bieber కు ఏమైంది..? ముఖం ఎందుకు ఇలా అయిపోతోందంటే..

కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (Justin Bieber) అనారోగ్యానికి గురయ్యాడు. అతడి ముఖానికి పక్షవాతం (Paralysis) వచ్చింది. రామ్సే హంట్ సిండ్రోమ్(Ramsay Hunt syndrome) కారణంగా ముఖంలోని కుడివైపు భాగంలో నరాలు చచ్చుబడిపోవడంతో అతడు పాక్షికంగా పక్షవాతానికి గురయ్యాడు. ప్రస్తుతం బీబర్ వరల్డ్ టూర్‌లో పాల్గొనాల్సి ఉంది. టూర్‌లో భాగంగా టొరెంటో కాన్సర్ట్‌లో పాల్గొనాలి. కానీ, ఈ కాన్సర్ట్ ప్రారంభం అవ్వడానికి కొద్ది గంటల ముందు క్యాన్సిల్ చేస్తున్నట్టు నిర్వహకులు ప్రకటించారు. దీంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేయడం ప్రారంభించారు. వారి అసంతృప్తిని చల్లార్చడానికి జస్టిన్ బీబర్ ఓ వీడియోను విడుదల చేశాడు.


ఆ వీడియోలో.. ‘‘మీరందరు చూస్తున్నారు కదా. నా కుడి కన్నును ఆర్పడానికి వీలు కావట్లేదు. నా ముఖంలోని కుడివైపు భాగం మొత్తం పక్షవాతానికి గురయింది. నా షోస్, కాన్సర్ట్స్ క్యాన్సిల్ కావడంతో కొంత మంది అసంతృప్తికి లోనయ్యారు. నేను శారీరకంగా, మానసికంగా ఆ కాన్సర్ట్స్‌లో పాల్గొనలేను. ఎందుకంటే నేను ఫిట్‌గా లేను. ఇది కాస్త తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఇప్పటికైనా నిదానించమని శరీరం చెబుతుంది. నేను కోలుకోవడానికి ముఖానికి సంబంధించిన వ్యాయామాలు చేస్తున్నాను. కొంతకాలం విశ్రాంతి తీసుకుని పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వచ్చి ప్రదర్శనలు ఇస్తాను’’ అని జస్టిన్ బీబర్ పేర్కొన్నాడు. అతడి వరల్డ్ టూర్ వాయిదా పడటం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు కరోనా కారణంగా ఆ టూర్‌లు వాయిదా పడ్డాయి. జస్టిన్ బీబర్ 13ఏళ్ల వయసుకే గ్లోబల్ పాప్ స్టార్‌గా ఫేమ్ సంపాదించుకున్నాడు. ‘బేబీ’(Baby), ‘బిలీవ్’(Believe) వంటి అల్బమ్‌లతో సంచలనం సృష్టించాడు. 22సార్లు గ్రామీ అవార్డ్ నామినేషన్స్ సాధించాడు. రెండు సార్లు గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు. 



Updated Date - 2022-06-11T21:51:44+05:30 IST