BOLLYWOOD నటుడి అమెరికన్ మాన్షన్... 32 కోట్లకు అమ్మేసిన HOLLYWOOD సింగర్!

ABN , First Publish Date - 2021-12-31T03:24:15+05:30 IST

బాలీవుడ్ నటుడి నుంచి కొన్న తన అమెరికన్ మాన్షన్‌ని ఆమె 4.3 మిలియన్ డాలర్లకు (32 కోట్లకు) అమ్మేసిందట. ఈ విషయాన్ని పలు హాలీవుడ్ మీడియా సంస్థలు కూడా నిర్ధారించాయి. లాక్‌డౌన్ కాలాన్ని కామిలా తన ఫేమస్ సింగర్ బాయ్‌ఫ్రెండ్ షాన్ మెండిస్‌తో ఇదే భవంతిలో గడిపింది...

BOLLYWOOD నటుడి అమెరికన్ మాన్షన్... 32 కోట్లకు అమ్మేసిన HOLLYWOOD సింగర్!

‘ధూమ్’ సిరీస్ సినిమాలు చూసేవారికి బాగా తెలిసిన పేరు ఉదయ్ చోప్రా. ప్రఖ్యాత బాలీవుడు దర్శకుడు యశ్ చోప్రాకి తనయుడు. బీ-టౌన్ టాప్ డైరెక్టర్ ఆదిత్య చోప్రాకు తమ్ముడు కూడా. అయితే, భారీగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఉదయ్ హిందీ తెరపై విజయం సాధించలేకపోయాడు. ‘ధూమ్’ సిరీస్ తప్ప అతని కెరీర్‌లో పెద్దగా చెప్పుకోవాల్సిన సినిమాలు లేవు. అయితే, ఉదయ్ చోప్రా వ్యక్తిగత జీవితం మాత్రం మంచి కలర్‌ఫుల్‌గానే సాగుతుంటుందని ముంబైలో టాక్. అప్పట్లో అమెరికన్ బ్యూటీ నర్గీస్ ఫక్రీతో చాలా కాలం డేటింగ్ చేశాడని కూడా అంటారు...


ముంబైలో పుట్టి, పెరిగిన ఉదయ్ చోప్రా ఎందుకు కొన్నాడోగానీ... కొన్నేళ్ల క్రితం దాకా లాస్ ఏంజిలెస్ నగరంలో ఓ విలాసవంతమైన భవనానికి యజమానిగా కొనసాగాడు. కానీ, 2019లో ఆ మాన్షన్‌ని అమెరికన్ సింగర్ కామిలా కాబెల్లోకి అమ్మేశాడు. 3.38 మిలియన్ డాలర్లకు, అంటే, మన కరెన్సీలో 25.21 కోట్లకు డీల్ సెట్ అయిందట. ఇక 2019 నుంచీ సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం కామిలా మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటుడి నుంచి కొన్న తన అమెరికన్ మాన్షన్‌ని ఆమె 4.3 మిలియన్ డాలర్లకు (32 కోట్లకు) అమ్మేసిందట. ఈ విషయాన్ని పలు హాలీవుడ్ మీడియా సంస్థలు కూడా నిర్ధారించాయి. లాక్‌డౌన్ కాలాన్ని కామిలా తన ఫేమస్ సింగర్ బాయ్‌ఫ్రెండ్ షాన్ మెండిస్‌తో ఇదే భవంతిలో గడిపింది. ఆ సమయంలో ఆమె పోస్ట్ చేసిన పిక్స్ నెట్‌లో వైరల్ అయ్యాయి. దాంతో ఉదయ్ చోప్రా మాజీ మాన్షన్‌కి కూడా క్రేజ్ పెరిగింది. అందుకే, కామిలా 3.95 మిలియన్ డాలర్లు మాత్రమే ఆశించినా 4.3 మిలియన్ డాలర్స్‌కి అందాల సౌధం అమ్ముడుపోయిందట!

Updated Date - 2021-12-31T03:24:15+05:30 IST