తప్పకుండా హిట్‌ అవ్వాలి బుజ్జీ..!

ABN , First Publish Date - 2022-08-14T06:14:13+05:30 IST

ధన్‌రాజ్‌, సునీల్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘బుజ్జీ ఇలా రా’. గరుడ వేగ అంజి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి కథ అందించి...

తప్పకుండా హిట్‌ అవ్వాలి బుజ్జీ..!

ధన్‌రాజ్‌, సునీల్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘బుజ్జీ ఇలా రా’. గరుడ వేగ అంజి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి కథ అందించి, దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించారు. ఇటీవల హైదరాబాద్‌లో అల్లరి నరేశ్‌ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ ‘‘నాగేశ్వరరెడ్డి అంటే నాకెంతో అభిమానం. ఆయన నాకు రెండు హిట్‌ చిత్రాల్ని అదించారు. గరుడ వేగతో మంచి పేరు తెచ్చుకొన్న అంజి దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. ఓ మంచి టెక్నీషియన్‌ దర్శకుడిగా మారితే మంచి ఫలితాలు వస్తాయి. ఈసినిమాతో ధన్‌రాజ్‌కి మంచి బ్రేక్‌ దొరకాల’’ని ఆకాంక్షించారు. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘‘స్నేహితుల కోసం చేసిన సినిమా ఇది. వాళ్లకోసమైనా ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవ్వాలి. అందుకోసం మేమంతా కష్టపడ్డాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాకి కర్త కర్మ క్రియ నాగేశ్వరరెడ్డి. సునీల్‌ రాకతో ఈ సినిమా స్థాయి మారిపోయింది. ఈ సినిమాతో అంజి పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోతార’’ని ధన్‌ రాజ్‌ తెలిపారు. 


Updated Date - 2022-08-14T06:14:13+05:30 IST