Liger : బంపర్ ఆఫర్.. మూడు టిక్కెట్లు కొంటే ఒకటి ఫ్రీ..

ABN , First Publish Date - 2022-08-29T18:10:35+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కలయికలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ (Liger). ఇటీవల భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకి తొలిరోజే డిజాస్టార్ టాక్ రావడంతో .. విజయ్ అభిమానులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు.

Liger : బంపర్ ఆఫర్.. మూడు టిక్కెట్లు కొంటే ఒకటి ఫ్రీ..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కలయికలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ (Liger). ఇటీవల భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకి తొలిరోజే డిజాస్టార్ టాక్ రావడంతో .. విజయ్ అభిమానులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూరీ రాసుకున్న కథాకథనాలు దారుణంగా మిస్ ఫైర్ అవడంతో హీరో, దర్శకుడు ఇద్దరికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పడం లేదు. సినిమాకి విడుదలకు ముందు నెలకొన్న భారీ హైప్ దృష్ట్యా తొలి రోజు వసూళ్ళు పర్వాలేదనిపించాయి. రివ్యూలు, మౌత్ టాక్ నెగెటివ్ గా రావడంతో రెండో రోజు నుంచి భారీ డ్రాప్స్ కనిపించాయి. 


ఎంత పెద్ద ఫ్లాప్ సినిమాకయినా ఆ మర్నాడు సక్సెస్ మీట్ లాంటిది పెట్టి.. మా సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పుకోవడం కామన్‌‌గా జరిగేదే. అయితే లైగర్ విషయంలో మాత్రం అలాంటి హడావిడి ఏమీ కనిపించడం లేదు. సినిమా విడుదలై నాలుగు రోజులైనా.. నిర్మాతల్లో ఒక్కరూ స్పందించలేదు. ఆల్రెడీ లైగర్ ఫ్లాప్ అయిపోయిందని చిత్ర బృందం కూడా డిసైడ్ అయి.. సినిమాను లైట్ తీసుకున్నారేమోననే సందేహాలు నెలకొన్నాయి. 


ఇక ఈ సినిమా రన్ ఎంత దారుణంగా ఉందంటే.. ఒక థియేటర్ లో ప్రేక్షకులు సరిగా రాక... సినిమాకోసం ఓ ప్రత్యేక ఆఫర్ పెట్టారు నిర్మాతలు. ‘లైగర్’ మూడు టిక్కెట్లు కొంటే ఒకటి ఫ్రీ అని ప్రకటించారు. అయినప్పటికీ సినిమా చూడ్డానికి ప్రేక్షకుల నుంచి అంతగా స్పందన లభించడం లేదని సమాచారం. ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా ఇంత దారుణంగా డిజాస్టర్ అవలేదని .. కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూరీ కనెక్స్ట్ (Puri Connects), ధర్మప్రొడక్షన్స్ (Dharma Productions) సంయుక్త బ్యానర్స్ లో నిర్మాణం జరుపుకున్న ‘లైగర్’ కు బాలీవుడ్ నుంచీ ఆశాభంగం తప్పలేదు. అక్కడ కూడా సినిమాకి డిజాస్టర్ టాక్ వినిపిస్తోంది.  

Updated Date - 2022-08-29T18:10:35+05:30 IST