Pawankalyan : రీమేక్ కోసం రంగంలోకి మరో స్టార్‌రైటర్ ‌?

ABN , First Publish Date - 2022-05-05T16:42:33+05:30 IST

పవర్‌స్టార్ Pawankalyan గత చిత్రం ‘భీమ్లానాయక్’ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ సెట్స్ పై ఉండగా.. త్వరలోనే ‘భవదీయుడు భగత్‌సింగ్’ షూటింగ్ ప్రారంభం కానుంది.

Pawankalyan : రీమేక్ కోసం రంగంలోకి మరో స్టార్‌రైటర్ ‌?

పవర్‌స్టార్ Pawankalyan గత చిత్రం ‘భీమ్లానాయక్’ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ సెట్స్ పై ఉండగా.. త్వరలోనే ‘భవదీయుడు భగత్‌సింగ్’ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. Pawankalyan మరో రీమేక్ మూవీకి కూడా కమిట్ అవుతున్నట్టు సమాచారం. ఈ సినిమా దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో సూపర్ హిట్టైన ‘వినోదయ చిత్తం’ చిత్రాన్ని పవర్ స్టార్ కోసం మార్పులు చేర్పులు చేస్తున్నారు. సముద్రఖని, తంబిరామయ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సముద్ర ఖనినే తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకుడిగా ఫిక్స్ చేసినట్టు టాక్. నిజానికి ఈ సినిమా స్ర్కిప్ట్ కోసం మళ్ళీ త్రివిక్రమ్ నే రంగంలోకి దింపారని ఇదివరకు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో మరో స్టార్ రైటర్ పేరు వినిపిస్తోంది.


‘భీమ్లానాయక్’ చిత్రానికి అంతా తానై నడిపించిన త్రివిక్రమ్‌కే మళ్ళీ తమిళ చిత్రం రీమేక్ బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారు. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా తీసే హడావిడిలో ఉండడంతో.. ఆయనకు ప్రత్నామ్నాయంగా..  స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్‌ను రంగంలోకి దింపుతున్నట్టు టాక్. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. అందుకే ఈ సినిమాకి కూడా ఆయన స్ర్కిప్ట్ బాధ్యతలు తీసుకుంటున్నారని వినికిడి. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో Pawankalyan ‘టైమ్’ పాత్రను పోషించబోతున్నారు. అలాగే.. ఇందులో మరో స్టార్ హీరో నటించడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పాత్రను సాయిధరమ్ తేజ్ చేస్తాడని ఇదివరకు వార్తలొచ్చాయి. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది.    

Updated Date - 2022-05-05T16:42:33+05:30 IST