Shah rukh Khanకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బుర్జ్ ఖలీఫా!

ABN , First Publish Date - 2021-11-03T21:09:34+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ 56వ జన్మదినోత్సవ వేడుకలు ఎప్పటిలా కాకుండా ఈ సారి నిరాడంబరంగా జరిగాయి.

Shah rukh Khanకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బుర్జ్ ఖలీఫా!

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ 56వ జన్మదినోత్సవ వేడుకలు ఎప్పటిలా కాకుండా ఈ సారి నిరాడంబరంగా జరిగాయి. షారూక్ విజ్ఞప్తి మేరకు అభిమానులు కూడా పెద్దగా సంబరాలు చేసుకోలేదు. అయితే ప్రతి సంవత్సరంలానే దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా ఈ ఏడాది కూడా షారూక్ బర్త్ డే సందర్భంగా వెలిగిపోయింది. మంగళవారం రాత్రి `హ్యాపీ బర్త్‌డే` అంటూ శుభాకాంక్షలు చెప్పింది. `వుయ్ లవ్‌ యూ` అంటూ షారూక్ పోస్టర్‌ను ప్రదర్శించింది. 


షారుక్ ఆల్‌ టైం హిట్ `దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే` సినిమాలోని `తుజే దేఖా తో యే జానా సనమ్` పాటను బ్యాగ్రౌండ్‌లో వినిపించింది. దీనికి సంబంధించిన వీడియోను మహ్మద్ అలబ్బర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడైన మహ్మద్.. షారూక్‌కు ప్రతి సంవత్సరం ఇలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. ఆయనకు షారూక్ ధన్యవాదాలు చెబుతుంటాడు. కాగా, షారూక్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం, దాదాపు 27 రోజులు జైలులో ఉండడం, ఇటీవలె బెయిల్‌పై విడదలవడం జరిగిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-11-03T21:09:34+05:30 IST