Bunny Vas: నిర్మాతలే నాశనం చేసుకున్నారు!

ABN , First Publish Date - 2022-07-04T21:50:52+05:30 IST

‘‘ఏ సినిమాను థియేటర్‌లో చూడాలి? ఓటీటీలో దేనిని చూడాలి? ఏ సినిమాకు ఎఫర్ట్‌ పెట్టి థియేటర్‌లో చూడాలి. దేనికి అవసరం లేదు? ఈ విషయాలపై ఆడియన్‌ చాలా క్లారిటీగా ఉన్నాడు. సగటు ప్రేక్షకుడు థియేటర్‌కి రావాలంటే సినిమా చాలా గొప్పదై ఉండాలి. అందులో కథ బలంగా ఉండాలి’’ అని బన్నీ వాసు అన్నారు.

Bunny Vas: నిర్మాతలే నాశనం చేసుకున్నారు!

‘‘ఏ సినిమాను థియేటర్‌లో చూడాలి? 

ఓటీటీలో దేనిని చూడాలి? 

ఏ సినిమాకు ఎఫర్ట్‌ పెట్టి థియేటర్‌లో చూడాలి. దేనికి అవసరం లేదు? 

ఈ విషయాలపై ఆడియన్‌ చాలా క్లారిటీగా ఉన్నాడు. 

సగటు ప్రేక్షకుడు థియేటర్‌కి రావాలంటే సినిమా చాలా గొప్పదై ఉండాలి. అందులో కథ బలంగా ఉండాలి’’ అని బన్నీ వాసు(Bunny vas) అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాణ రంగం, థియేటర్‌ వ్యవస్థ ఎలా ఉంది అనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలు...


‘‘ఓ సినిమా విడుదల ఉందీ అంటే దానికి తగ్గ ఎగ్జైట్‌మెంట్‌ కలగజేస్తేనే ప్రేక్షకులు టికెట్‌ కొని థియేటర్‌కి వస్తున్నాడు. ఆ ఆసక్తి కలగజేయకపోతే నేనెందుకు చూడాలి అన్న ఆలోచనలో ఉన్నారు. చాలామంది మేకర్స్‌ ఈ విషయాన్ని ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఒకప్పుడు ఆడియన్‌ టైమ్‌ పాస్‌ కోసం థియేటర్‌కి వచ్చేవాడు. ఇప్పుడు అతని టైమ్‌పాస్‌ కోసం సినిమా నేరుగా ఓటీటీ రూపంలో ఇంట్లోకే వెళ్లిపోయింది. హాయిగా ఇంట్లో భోజనం చేసి కావలసిన సినిమా చూసుకుంటున్నాడు. ఇదివరకు ఈ అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు వెయ్యి రూపాయలకు వంద సినిమాలు చూస్తున్నాడు. ఇది ఎవరో వచ్చి నాశనం చేసింది కాదు మా నిర్మాతలు చేసుకున్నదే. ఇంట్లోకి సినిమా పంపితే మన రెవెన్యూ పడిపోతుంది.. కార్పొరేట్‌ ఓటీటీలు ఇచ్చేదానికి నిర్మాత కట్టుబడి ఉండాలనే సంగతి మరచిపోయారు. థియేటర్‌లో సినిమా చూడడం ద్వారా ప్రొడ్యూస్‌ అయ్యే ఇన్‌కమ్‌ను చంపేశారు. నిర్మాతగా నేను ఇలా మాట్లాడటం కరెక్ట్‌ కాదని తెలుసు. మా కాంపౌండ్‌లో కూడా ఒక ఓటీటీ ఉంది. ఎందుకంటే కాలం గడుస్తున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది. దానితోపాటే మనం పరుగులు తీయాల్సి వస్తుంది. ఒక టెక్నాలజీ అభివృద్ధి చెంది మనం దానికి అలవాటు పడితే.. అప్పటి వరకూ సంప్రదాయంగా వస్తున్న అలవాటు మారిపోతుంది. ఉదాహరణకు ఒకప్పుడు ప్రొజెక్టర్స్‌ మీది ఆడిన సినిమాలు ఇప్పుడు ఫిల్మ్‌తో పనిలేకుండి శాటిలైట్‌, హార్డ్‌డిస్క్‌, క్యూబ్‌ ఇలా ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చాయి. వీటిని స్వాగతించడంతో ఫిల్మ్‌ ప్రొజెక్టర్‌ కనుమరుగైంది. ఇప్పుడు ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్తుల్లో థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరమే. చాలామంది పెద్ద నిర్మాతలతో మాట్లాడుతున్నప్పుడు ‘సమస్య ఏం ఉండదు.. థియేటర్‌ పరిస్థితి బాగుపడుతుంది అంటారు’ కానీ అది కష్టం. ఎప్పుడైతే నిర్మాతలు 30–40 రోజులకు సినిమాను ఓటీటీకి అమ్మేస్తునారో అప్పుడే మేం భవిష్యత్తును ఊహించాం. ఫ్యూచర్‌ డిజిటల్‌దే.. థియేటర్‌ అనే సంప్రదాయం క్రమేపి తగ్గిపోతుందనిపించడంతో కంపెనీకి భవిష్యత్తు ఉండదని గమనించి ఓటీటీ వ్యాపారంలో దిగాం’’ అని వివరించారు. (Producer bunny vas about ott)


Updated Date - 2022-07-04T21:50:52+05:30 IST