Bunny In Black : ఐకాన్ స్టార్ ఫోటో వైరల్..

ABN , First Publish Date - 2022-07-25T13:41:04+05:30 IST

నిన్నమొన్నటి వరకూ స్టైలిష్ స్టార్‌గా పిలిపించుకున్న అల్లు అర్జున్ (Allu Arjun).. ‘పుష్ప’ (Pushpa) సినిమా అఖండ విజయంతో.. ఐకాన్ స్టార్ అయిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా కళ్ళు చెదిరే కలెక్షన్స్ కురిపించిన ఈ సినిమా తర్వాత అతడు పాన్ ఇండియా స్టార్‌గానూ అవతరించాడు.

Bunny In Black : ఐకాన్ స్టార్ ఫోటో వైరల్..

నిన్నమొన్నటి వరకూ స్టైలిష్ స్టార్‌గా పిలిపించుకున్న అల్లు అర్జున్ (Allu Arjun).. ‘పుష్ప’ (Pushpa) సినిమా అఖండ విజయంతో.. ఐకాన్ స్టార్ అయిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా కళ్ళు చెదిరే కలెక్షన్స్ కురిపించిన ఈ సినిమా తర్వాత అతడు పాన్ ఇండియా స్టార్‌గానూ అవతరించాడు. ఉత్తరాదిన తొలి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటిచెప్పాడు. పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. బాలీవుడ్ వసూళ్ళే అతడి స్థాయిని అమాంతం పెంచేశాయి. ఆ కారణంగా ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల ఇండియా టుడే కవర్ పేజ్‌కెక్కి ‘ది సౌత్ స్వాగ్’ (The South Swag) అనే శీర్షికలో తనూ ఒక భాగమయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సౌత్ చిత్రాల కెపాసిటీపై ప్రచురించిన ఆర్టికల్‌లో తనే ప్రముఖంగా హైలైట్ అయ్యాడు. 


ప్రస్తుతం బన్నీ అంటే.. ఇండియన్ మార్కెట్‌లో ఒక బ్రాండ్. ప్రస్తుతం అతడు ఏం చేస్తున్నా.. ఎలా కనిపిస్తున్నా క్షణాల్లో వైరల్ అయిపోతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఒక పిక్.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్లాక్ టీ షర్ట్ ధరించి.. బ్లాక్ బ్యాక్ గ్రౌండ్‌లో హ్యాండ్సమ్‌గా రివీలైన అతడి లుక్స్‌కు అభిమానులు తెగ ఫిదా అయిపోతున్నారు. ఇందులో బన్నీ స్టైల్ కింగ్ (Style King) అనిపిస్తున్నాడు. హెయిర్ స్టైల్, మ్యాన్లీ అపీరెన్స్ బన్నీని కొత్తగా ప్రెజెంట్ చేశాయి. ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రంలో నటించడానికి రెడీగా ఉండడంతో.. మొదటి భాగానికి సంబంధించిన మేకోవర్‌నే కంటిన్యూ చేస్తున్నాడు అల్లు అర్జున్. అందుకే అపీరెన్స్‌లో తగ్గేదేలే అనిపించుకుంటున్నాడు. 


‘పుష్ప’ మొదటి భాగంలో అతడి మాస్ అవతార్‌కు తెగ మురిసిపోయిన అభిమానులు.. రెండో భాగంలోనూ అదే స్టైల్‌ను కంటిన్యూ చేస్తుండడంతో అంచనాలు పీక్స్‌కు చేరాయి. బన్నీ బ్లాక్ డ్రెస్ లుక్‌కు అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా తెగ పొగిడేస్తూ కామెంట్స్  చేస్తున్నారు. స్టైల్ లో నిన్ను కొట్టే వాడేలేడంటూ.. అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. ‘పుష్ప 2’ సెట్స్ పైకి వెళ్ళే లోపు.. బన్నీ  ఇలాంటి క్రేజీ పిక్స్ ను ఇంకెన్ని షేర్ చేస్తాడో చూడాలి.  



Updated Date - 2022-07-25T13:41:04+05:30 IST