Pushpa 2 బడ్జెట్ రూ.350 కోట్లు..? అందులో వారి రెమ్యూనరేషన్లే..

ABN , First Publish Date - 2022-07-12T15:32:51+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), యంగ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప (Pushpa)’...

Pushpa 2 బడ్జెట్ రూ.350 కోట్లు..? అందులో వారి రెమ్యూనరేషన్లే..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), యంగ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప (Pushpa)’. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ మూవీలో.. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్’ గతేడాది విడులైంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్‌ ‘పుష్ప: ది రూల్’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ తరుణంలో ఈ సినిమా మేకింగ్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి పార్ట్ కంటే చాలా ఎక్కువ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 


వార్తల ప్రకారం ‘పుష్ప 2’ దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దీంట్లో మొదటి పార్ట్ హిట్‌తో వచ్చిన ఫేమ్‌తో అల్లు అర్జున్ ఆ పారితోషికాన్ని రూ.90 కోట్ల వరకూ పెంచేశాడట. అంతేకాకుండా లాభాల్లో సైతం వాటా తీసుకోనున్నట్లు వినికిడి. దీని ప్రకారం.. ఈ మూవీతో రూ.100 కోట్లకి పైగా ఆదాయం సంపాదించుకోనున్నట్లు అర్థమవుతోంది. అలాగే.. సుకుమార్ సైతం  ‘పుష్ప 1’ కోసం రూ.18 కోట్ల వరకు పారితోషికం అందుకోగా.. సెకండ్ పార్ట్‌ కోసం రూ.40 కోట్లకి పెంచేశాడని వినికిడి. అంతేకాకుండా ఇతర ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ పారితోషికాల కోసం దాదాపు రూ.50 నుంచి 75 కోట్ల వరకు ఖర్చు అవ్వనుంది. ఇవేకాకుండా.. మేకింగ్ ఖర్చులతో కలిపి దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ అవ్వనుందట. ఈ బడ్జెట్ ప్రభాస్ నటించిన సాహో, బాహుబలి చిత్రాల బడ్జెట్‌తో సమానం కావడం విశేషం. ‘పుష్ప 2’ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రీ పొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Updated Date - 2022-07-12T15:32:51+05:30 IST