Pushpa 2: ఆలస్యానికి కారణం ‘ఉప్పెన’ దర్శకుడేనా?

ABN , First Publish Date - 2022-07-28T02:03:16+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా..

Pushpa 2: ఆలస్యానికి కారణం ‘ఉప్పెన’ దర్శకుడేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కాల్సిన ‘పుష్ప 2’ (Pushpa 2) అనేకానేక కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. వాస్తవానికి ఈసరికే ఆ చిత్రం సెట్స్‌పై ఉండాలి. కానీ.. సుకుమార్, అల్లు అర్జున్.. ఇంకా ఈ సినిమా షూటింగ్‌కి రెడీ కాలేదు. ఆగస్ట్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వార్తలైతే వినబడుతున్నాయి. ‘పుష్ప’కి వచ్చిన క్రేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ‘పుష్ప 2’ స్ర్కిప్ట్‌ని సుకుమార్ రెడీ చేస్తున్నారని.. అందుకే షూటింగ్ ఇంకా మొదలు కాలేదనేలా ఈ మధ్య వార్తలు వినవచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు ‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు..  ఈ సినిమా షూటింగ్ ఆలస్యానికి కారణంగా తెలుస్తుంది. 

 

అదెలా అంటే.. ‘ఉప్పెన’తో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు (Buchibabu).. దర్శకుడు సుకుమార్‌కు ప్రియశిష్యుడనే విషయం తెలిసిందే. ‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో బుచ్చిబాబును దర్శకుడిగా సుకుమార్ పరిచయం చేశారు. ఆ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా.. ఇప్పటి వరకు బుచ్చిబాబు తన రెండో ప్రాజెక్ట్‌ని ప్రకటించలేదు. ఇప్పుడాయన చేయబోయే రెండో సినిమాకు కూడా కథ విషయంలో సుకుమార్ ఇన్‌పుట్స్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. రీసెంట్‌గా ఈ యువ దర్శకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కలిసి స్టోరీని వినిపించాడనేలా వార్తలు వచ్చాయి. అయితే బుచ్చి చెప్పిన కథ విన్న తారక్.. అందులో కొన్ని మార్పులు చేయమని చెప్పాడట. ఈ మార్పుల విషయంలో ఇప్పుడు బుచ్చిబాబు.. తన గురువు సుకుమార్ కంట్రిబ్యూషన్స్ కోరాడని సమాచారం. 


ఇప్పటికే ‘పుష్ప 2’ కథపై కసరత్తులు చేస్తున్న సుకుమార్.. ఇప్పుడు బుచ్చిబాబు రెండో సినిమా కథ విషయంలో కూడా ఇన్‌వాల్వ్ అవుతున్నాడని టాక్. ఈ కథపై కూడా  సుకుమార్‌ తీక్షణంగా దృష్టి పెట్టాడని.. అయితే బుచ్చిబాబు రెడీ చేసిన ఈ కథ కాస్త ఆయనని ఇబ్బంది పెడుతుందని సమాచారం. తారక్‌తో సినిమా కావడంతో.. బుచ్చిబాబు కూడా సుకుమార్‌ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడట. ఆయన ఎక్కడికి వెళితే.. అక్కడికి ఈ స్ర్కిప్ట్ పట్టుకుని సుకుమార్ వెంట పడుతున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఈ విధంగా ‘పుష్ప 2’ ఆలస్యానికి బుచ్చిబాబు కూడా కారణమవుతున్నాడనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

Updated Date - 2022-07-28T02:03:16+05:30 IST