Britney Spears : ఆమె బయట పెట్టబోయే రహస్యాల విలువ... 112 కోట్లు!

ABN , First Publish Date - 2022-02-23T03:40:03+05:30 IST

అమెరికన్ క్రేజీ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఓ భారీ డీల్ కుదుర్చుకుంది. 15 మిలియన్ డాలర్ల బుక్ డీల్ ఆమె సైన్ చేసింది. అంటే... మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుంటే 112 కోట్లకు పైమాటే! ఇంతకీ, అంత పెద్ద మొత్తం ఆమెకి ఎవరు ఇస్తున్నారు? ఎందుకు? అంటారా...

Britney Spears : ఆమె బయట పెట్టబోయే రహస్యాల విలువ... 112 కోట్లు!

అమెరికన్ క్రేజీ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఓ భారీ డీల్ కుదుర్చుకుంది. 15 మిలియన్ డాలర్ల బుక్ డీల్ ఆమె సైన్ చేసింది. అంటే... మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకుంటే 112 కోట్లకు పైమాటే! ఇంతకీ, అంత పెద్ద మొత్తం ఆమెకి ఎవరు ఇస్తున్నారు? ఎందుకు? అంటారా...  


తన సుదీర్ఘ కన్సర్వేటర్‌షిప్ గురించి మొత్తం అంతా బయట పెట్టేసేందుకు బ్రిట్నీ అంగీకరించింది. యూఎస్‌లోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్‌తో ఆమెకు ఒప్పందం కుదిరింది. ఇంకా అనేక ప్రచురణ సంస్థలు పోటీ పడినప్పటికీ సదరు పబ్లిషింగ్ కంపెనీ రికార్డు రేటుకి పుస్తకం హక్కులు కొనుగోలు చేసింది. అయితే, బ్రిట్నీ విడుదల చేయబోయే బుక్‌లో తండ్రి జేమీ స్పియర్స్ సంరక్షణలో తాను అనుభవించిన 13 ఏళ్ల నరకప్రాయమైన జీవితం గురించి అనేక రహస్యాలుంటాయట. మూడు నెలల కిందే ఆమెకు తండ్రి కన్సర్వేటర్‌షిప్ నుంచీ సంపూర్ణంగా విముక్తి లభించింది. చాలా కాలం పాటూ కోర్టులో కేసు నడిచిన తరువాత బ్రిట్నీ జీవితంపై, ఆస్తిపాస్తుల ఆమె తండ్రికి ఎలాంటి నియంత్రణ ఉండబోదని తీర్పు వెలువడింది. ఆమెని 13 ఏళ్ల కాలంలో తండ్రి జేమీ స్పియర్స్ అనేక ఇబ్బందులు, కష్టాలకు గురి చేశాడని అమెరికన్ పాప్ స్టార్ కోర్టులో వెల్లడించింది. దాంతో అభిమానుల నుంచీ కూడా బ్రిట్నీకి భారీగా మద్దతు లభించింది. ఫలితంగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదంటూ ఏళ్ల కిందట న్యాయస్థానం విధించిన కన్సర్వేటర్‌షిప్ ఎట్టకేలకు రద్దైపోయింది. ప్రస్తుతం స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవితం కొనసాగిస్తోన్న బ్రిట్నీ భారీ బుక్ డీల్ కుదుర్చుకోవటంతో ఆమె గతంలోంచి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...

Updated Date - 2022-02-23T03:40:03+05:30 IST