అందాలు మెరుగు పెట్టుకునేందుకు... డాక్టర్ వద్దకెళ్లి... తిరిగొచ్చేసిన అమెరికన్ బ్యూటీ!

ABN , First Publish Date - 2022-03-26T03:42:47+05:30 IST

అమెరికన్ సెక్సీ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన అందాల కోసం బెంగ పెట్టుకుందట. అంతే కాదు, ఓ దశలో నేరుగా డాక్టర్ వద్దకెళ్లి వెయిటింగ్ కూడా చేసిందట. మళ్లీ అంతలోనే మనసు మార్చుకుని అందాలేవీ మార్చుకోకుండానే తిరిగి వచ్చేసిందట!

అందాలు మెరుగు పెట్టుకునేందుకు... డాక్టర్ వద్దకెళ్లి... తిరిగొచ్చేసిన అమెరికన్ బ్యూటీ!

అమెరికన్ సెక్సీ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తన అందాల కోసం బెంగ పెట్టుకుందట. అంతే కాదు, ఓ దశలో నేరుగా డాక్టర్ వద్దకెళ్లి వెయిటింగ్ కూడా చేసిందట. మళ్లీ అంతలోనే మనసు మార్చుకుని అందాలేవీ మార్చుకోకుండానే తిరిగి వచ్చేసిందట!


సింగర్‌గానే కాక బ్రిట్నీ స్పియర్స్‌కి అందగత్తెగా కూడా యూఎస్‌లో ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో మనకు తెలిసిందే. కానీ, హాట్ అండ్ సెక్సీ పాప్ సెన్సేషన్ కొన్నాళ్లుగా బరువు తగ్గిపోతోందట. కారణం ఏంటోగానీ... ఆరు నెలల్లోనే ఏడు పౌండ్ల వెయిట్ లాస్ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమే స్వయంగా చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయం నెటిజన్స్‌తో పంచుకున్న బ్రిట్నీ మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన వక్షోజాలు చాలా చిన్నగా మారిపోయాయని ఆమె తెలిపింది. అసలు కుంచించుకుపోయిన తన స్థనాలు ఎటు వెళ్లాయో... తనకే తెలియదని అర్థం వచ్చేలా ఇంగ్లీషులో రాసుకొచ్చింది! ఇక బ్రిట్నీ బూబ్ జాబ్ పోస్టులో కొసమెరుపు ఏంటంటే తాను ‘అందాల’ మెరుగుదల కోసం డాక్టర్ వద్దకి కూడా వెళ్లానని చెప్పటం! కానీ, వైద్యుడి కోసం నిరీక్షిస్తోన్న సమయంలో పాప్ సింగర్ మనసు మారిపోయిందట. వెంటనే అక్కడ్నుంచీ లేచి ఇంటికి వచ్చేసిందట. బ్రిట్నీ స్పియర్స్ వెయిట్ లాస్, డాక్టర్ కోసం వెయిటింగ్... వీటన్నిటిపై వేల కామెంట్స్ చేస్తోన్న నెటిజన్స్... ఆమె ఆరోగ్యంగా ఉండాలని మాత్రం ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.   

Updated Date - 2022-03-26T03:42:47+05:30 IST