Life Imprisonment: తల్లిని చంపినందుకు బ్రిటిష్ నటుడికి జీవిత ఖైదు.. ప్రాక్టీస్ చేసి మరి..

Twitter IconWatsapp IconFacebook Icon
Life Imprisonment: తల్లిని చంపినందుకు బ్రిటిష్ నటుడికి జీవిత ఖైదు.. ప్రాక్టీస్ చేసి మరి..

‘డైరీ ఆఫ్ ది వింపీ కిడ్’, ‘రివర్‌డేల్’ వంటి గొప్ప చిత్రాలలో నటించి మెప్పించిన నటుడు ర్యాన్ గ్రాంథం (Ryan Grantham). ఈ నటుడి మీద 2020లో తన తల్లిని చంపిన కేసు నమోదైంది. ఈ కేసుని విచారించిన బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. హాలీవుడ్ నటుడు ర్యాన్ తన తల్లి బార్బరా వెయిట్‌ను చంపినట్లు ఎదురైన ఆరోపణలు నిరూపణ అయ్యాయి. దాంతో ఈ హత్య కేసులో ఈ నటుడికి జీవిత ఖైదు (Life Imprisonment) విధించింది.


హత్యకు ముందు ప్రాక్టీస్ చేసిన ర్యాన్..

విచారణ సమయంలో ర్యాన్ తన 64 ఏళ్ల తల్లిని మార్చి 31, 2020న చంపాడని కుటుంబ న్యాయవాది స్పష్టంగా తెలియజేశారు. బార్బరా పియానో ​​వాయిస్తుండగా వెనుక నుంచి తల్లి తలపై కాల్చాడు. అంతేకాకుండా.. హత్య చేయడానికి ముందు ర్యాన్ చాలాసార్లు ప్రాక్టీస్ చేశాడని, అలాగే హత్య సమయంలో మొత్తం ప్రక్రియను వీడియో రికార్డ్ చేసినట్లు లీగల్ అథారిటీకి ఆధారాలు దొరికాయి. కాగా.. ఈ శిక్ష సమయంలో ర్యాన్ గ్రాంథంకి 14 సంవత్సరాల పాటు పేరోల్‌కి అవకాశం లేదు.


ర్యాన్ తన తల్లిని హత్య చేయాలని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాడని విచారణలో తేలింది. హత్య జరిగిన రోజు అతని కారులో మూడు లోడెడ్ తుపాకులు, కాక్‌టెయిల్స్ లభ్యమయ్యాయి. హత్య చేసినట్లు ర్యాన్ స్వయంగా అంగీకరించాడు. హత్య చేసినప్పుడు ర్యాన్ వయస్సు కేవలం 21 సంవత్సరాలు కావడం గమనార్హం.


నివేదికల ప్రకారం.. ర్యాన్ మానసిక పరిస్థితి బాగా లేదు. హత్యకు ముందు ర్యాన్ హింసాత్మక కంటెంట్‌ను చాలా చూశాడు. అది అతనిపై చెడు ప్రభావాన్ని చూపింది. జైలులో ఉన్నప్పుడు, అతనికి మానసిక చికిత్స అందించారు. అక్కడ అతను కొంచెం మెరుగయ్యాడు. అలాగే.. ర్యాన్‌కు వ్యతిరేకంగా సోదరి దియా స్టేట్‌మెంట్ ఇచ్చింది. తల్లి మృతితో కుటుంబం మొత్తం కుదేలైందని, ఈ ఘటన ప్రభావం తమపై జీవితాంతం ఉంటుందని అందులో చెప్పుకొచ్చింది.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.