Mary Reynolds: ఇక ఆ క్వీన్ రోల్ వేయను

ABN , First Publish Date - 2022-09-14T23:14:15+05:30 IST

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (Elizabeth II) సెప్టెంబర్ 8న మరణించిన సంగతి తెలిసిందే. మేరీ రేనాల్డ్స్ (Mary Reynolds) అచ్చం దివంగత బ్రిటన్ రాణి మాదిరిగానే ఉంటుంది. 34ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో

Mary Reynolds: ఇక ఆ క్వీన్ రోల్ వేయను

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (Elizabeth II) సెప్టెంబర్ 8న మరణించిన సంగతి తెలిసిందే. మేరీ రేనాల్డ్స్ (Mary Reynolds) అచ్చం దివంగత బ్రిటన్ రాణి మాదిరిగానే ఉంటుంది. 34ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కెరీర్‌ను కొనసాగిస్తుంది. తాజాగా ఎలిజబెత్ మరణించడంతో ఆమె పాత్రను పోషించనని మేరీ రేనాల్డ్స్ తెలిపింది. రాణిని ఎప్పుడు తన కుటుంబ సభ్యురాలిగా భావించానని చెప్పింది. మేరీ రేనాల్డ్స్ తాజాగా మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగానే  మీడియాతో ఈ విషయాన్ని చెప్పింది. 


ఎలిజబెత్-2 రాణి మాదిరిగా కనిపించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ‘‘ రాణి అద్భుతమైన వ్యక్తి. ఆమె మాదిరిగా కనిపించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. రాణి మరణానికి ముందు నేను టెలివిజన్ ముందు కూర్చున్నాను. అప్పుడు నా మనస్సు సంకోచించింది. ఏదో చెడు వార్త రాబోతుందని అర్థమైంది. అది చివరికి రానే వచ్చింది. ఎలిజబెత్-2 చనిపోయింది. ఆ విషయం తెలియగానే నాకు చాలా బాధేసింది. రాణి గౌరవార్థం నేను ఇకపై ఆమె పాత్రను పోషించను’’ అని మేరీ రేనాల్డ్స్ చెప్పింది. ఎలిజబెత్-2 మరణించిందని తెలియగానే రష్యన్ టెలివిజన్ కంపెనీ మేరీ వద్దకు వచ్చింది. రాణి పాత్రను పోషించాలని కోరింది. కానీ, అందుకు ఆమె నిరాకరించింది.‘‘ రష్యన్ టెలివిజన్ కంపెనీ నాతో నటింపచేయాలనుకున్నారు. రాణి పాత్రను పోషించాలని కోరారు. నేను ప్రస్తుతం ఆ పాత్రను పోషించాలంటే నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. నేను ఇంటికి వచ్చి చూడగా రెండు బాక్సుల నిండా టోపీలు ఉన్నాయి. ఇక వాటి అవసరం నాకు ఎంత మాత్రం లేదు’’ అని మేరీ తెలిపింది. 

Updated Date - 2022-09-14T23:14:15+05:30 IST