Leonardo DiCaprio ని ‘‘నోరు మూసుకో’’మన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ Bolsonaro

ABN , First Publish Date - 2022-05-08T22:50:38+05:30 IST

హాలీవుడ్ యాక్టర్ లియోనార్డో డికాప్రియోని ‘‘నోరు మూసుకో...’’ అంటూ ఘాటుగా హెచ్చరించాడు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో. ఆయన ఆగ్రహానికి కారణం ‘టైటానిక్’ స్టార్ అమేజాన్ అడవుల పరిరక్షణ గురించి మాట్లాడుతుండటమే.

Leonardo DiCaprio ని ‘‘నోరు మూసుకో’’మన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ Bolsonaro

హాలీవుడ్ యాక్టర్ లియోనార్డో డికాప్రియోని ‘‘నోరు మూసుకో...’’ అంటూ ఘాటుగా హెచ్చరించాడు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో. ఆయన ఆగ్రహానికి కారణం ‘టైటానిక్’ స్టార్ అమేజాన్ అడవుల పరిరక్షణ గురించి మాట్లాడుతుండటమే. 


బ్రెజిల్ ప్రెసిడెంట్ ని ఉద్దేశించి డికాప్రియో చేసిన ట్వీట్ లో... అమేజాన్ అడవుల క్షీణతకి బోల్సనారోనే కారణమన్నాడు. అయితే, నేరుగా ఆయన పేరు మాత్రం తన ట్వీట్ లో ప్రస్తావించలేదు. అయినా డికాప్రియో తగిన వారికి ఓటు వేయండంటూ బ్రెజిల్ యువతకి పిలుపునివ్వటంతో ఆ దేశపు ప్రస్తుత అధ్యక్షుడికి సహనం నశించింది. నేరుగా మీడియాలోనే కాక సొషల్ మీడియాలోనూ హాలీవుడ్ స్టార్ హీరోని టార్గెట్ చేశాడు... 


బోల్సనారో అధికారంలోకి వచ్చాక అమేజాన్ అడవుల్లో నరికివేతలు ఎక్కువయ్యాయని లియోనార్డో ఆరోపించటంతో సమస్య మొదలైంది. దానిపై స్పందిస్తూ బ్రెజిల్ అధ్యక్షుడు ‘డబ్ల్యూటీఓ’ వైస్ ప్రెసిడెంట్ మాటల్ని గుర్తు చేశాడు. బ్రెజిల్ లో వ్యవసాయం ప్రభావితమైతే ప్రపంచం ఆకలితో ఉండాల్సి వస్తుందని ఆయన అన్నాడు. అదే విషయం చెబుతూ ‘‘డికాప్రియో అర్థంపర్థం లేకుండా మాట్లాడటం కంటే నోరు మూసుకోవటం మంచిది...’’ అన్నాడు బోల్సనారో. 


ట్విట్టర్ లోనూ బ్రెజిల్ అధ్యక్షుడు స్వయంగా హాలీవుడ్ స్టార్ హీరోకి కౌంటర్ ఇచ్చారు. ఒకవైపు థాంక్స్ చెబుతూనే, అమేజాన్ పై బ్రెజిల్ సార్వభౌమాధికారాన్ని... తమ దేశపు జనం ఎన్నికల్లో ఓట్ల ద్వారా కాపాడుకుంటారని అన్నాడు. ‘‘విదేశీ తొత్తులుగా వ్యవహరించే మోసగాళ్ల’’కు తగిన బుద్ధి చెబుతారని నమ్మకం వ్యక్తం చేశాడు. 

   

మరో సోషల్ మీడియా పోస్టులో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో... లియోనార్డో డికాప్రియో పోస్ట్ చేసిన ఫోటోని తప్పుబట్టాడు. అతను 2019 అమేజాన్ అడవుల్లోని కార్చిచ్చుల గురించి మాట్లాడుతూ 2003 నాటి ఫోటో పోస్ట్ చేశాడంటూ ఎత్తి చూపాడు.

Updated Date - 2022-05-08T22:50:38+05:30 IST