Brahmastra: అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ సినిమాగా నిలుస్తుందా..!

ABN , First Publish Date - 2022-09-17T20:50:42+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీ కఫుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్

Brahmastra: అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ సినిమాగా నిలుస్తుందా..!

బాలీవుడ్ సెలబ్రిటీ కఫుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఫాక్స్‌స్టార్ స్టూడియోస్‌తో కలసి నిర్మించాడు. ఈ సినిమా పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల అయింది. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికి, బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబడుతుంది. తొలి మూడు రోజుల్లోనే అన్ని వెర్షన్స్ కలుపుకొని రూ.100కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్‌ను సాధించింది. సినిమా రెండో వీకెండ్‌లోకి కూడా అడుగుపెట్టింది. అయినప్పటికీ, వసూళ్ల సునామీని కురిపిస్తూనే ఉంది. ఇదే జోరులో కలెక్షన్స్‌ను రాబడితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రం ‘ద కశ్మీర్ పైల్స్’ (The Kashmir Files) రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 


‘బ్రహ్మాస్త్ర’ ను రూ.410కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. సినిమా హిట్‌గా నిలవాలంటే రూ.500కోట్ల వసూళ్లను రాబట్టాలి. కానీ, ఈ చిత్రం ఆ స్థాయి వసూళ్లను రాబట్టలేదని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. మూవీ విడుదలై నేటికి ఎనిమిది రోజులవుతుంది. ఎనిమిదో రోజు రూ.10.5కోట్ల నెట్ కలెక్షన్స్ ‌ సాధించింది. దీంతో మూవీ కలెక్షన్స్ రూ. 180.64కోట్లకు చేరాయి. ఈ ఏడాది విడుదలైన ‘ద కశ్మీర్ పైల్స్’ పూర్తి రన్‌లో రూ.252.90కోట్ల వసూళ్లను రాబట్టింది. అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ‘బ్రహ్మాస్త్ర’ పూర్తి ‌రన్‌లో ‘కశ్మీర్ పైల్స్’ కలెక్షన్స్‌ను అధిగమిస్తుందా అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ‘బ్రహ్మాస్త్ర’ లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ తదితరలు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-09-17T20:50:42+05:30 IST