Brahmastra: ఆ విషయంలో ‘ఆర్ఆర్ఆర్‌’ని దాటేసిన ‘బ్రహ్మాస్త్ర’.. కానీ ‘కేజీయఫ్ 2’ని మాత్రం టచ్ చేయలేక..

ABN , First Publish Date - 2022-09-06T22:26:18+05:30 IST

భార్యాభర్తలైన రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్(Alia Bhatt) మొట్టమొదటిసారి జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర (Brahmastra)’...

Brahmastra: ఆ విషయంలో ‘ఆర్ఆర్ఆర్‌’ని దాటేసిన ‘బ్రహ్మాస్త్ర’.. కానీ ‘కేజీయఫ్ 2’ని మాత్రం టచ్ చేయలేక..

భార్యాభర్తలైన రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్(Alia Bhatt) మొట్టమొదటిసారి జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర (Brahmastra)’. కరణ్ జోహార్ (Karan Johar) నిర్మాతగా వ్యవహిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఇటీవల విడుదలైన బాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్‌గా మిగులుతున్నాయి. అందులో.. స్టార్ హీరోలైన ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ వంటి పలు సినిమాలు సరైన ఓపెనింగ్స్ సాధించలేక చతికిలాపడ్డాయి.


ఈ తరుణంలో భారీ అంచనాల మధ్య ‘బ్రహ్మాస్త్ర’ విడుదలకి సిద్ధమవుతోంది. దీంతో బాలీవుడ్ మొత్తం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఈ సినిమా కూడా ఫ్లాప్‌గా మిగిలితే బాలీవుడ్ మరి చిక్కుల్లో పడుతుంది. ఈ సమయంలో ఇటీవలే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. పాండామిక్ తర్వాత మొదటి రోజే అత్యధిక అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ముఖ్యంగా సూపర్ హిట్లుగా నిలిచిన ‘భూల్ భూలయ్యా 2’, రాజమౌళి చిత్రం ‘ఆర్ఆర్ఆర్(RRR)’ హిందీ వెర్షన్ బుకింగ్స్ కంటే ఎక్కువగా టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ‘కేజీయఫ్ 2(KGF 2)’ హిందీ వెర్షన్‌ని మాత్రం ఈ డైరెక్ట్ బాలీవుడ్ చిత్రం టచ్ చేయలేకపోయింది. ఆ మూవీ మొదటి పార్ట్ ‘కెజీయఫ్ ఛాప్టర్ 1’ క్రియేట్ చేసిన సంచనాలు కారణంగా.. సీక్వెల్‌కి క్రియేటైన బజ్ అలాంటిది.


టాప్ హిందీ చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ ఇవి..

కేజీయఫ్ చాప్టర్ 2 - 4.35 లక్షలు

ఆర్ఆర్ఆర్ - 1.5 లక్షలు

భూల్ భూలయ్యా 2 - 1.3 లక్షలు

అయితే.. బ్రహ్మాస్త్ర ఇప్పటి వరకూ దాదాపు 1.7 లక్షల బుకింగ్స్ సాధించాయి. కాగా.. ఈ మూవీ విడుదలకి మరో మూడు రోజులు ఉన్న ఈ తరుణంలో బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Updated Date - 2022-09-06T22:26:18+05:30 IST