Brahmastra: నిరాశలో తారక్ ఫ్యాన్స్.. కారణమిదే!!

ABN , First Publish Date - 2022-09-02T23:57:49+05:30 IST

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మస్త’ (Brahmastra). రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత..

Brahmastra: నిరాశలో తారక్ ఫ్యాన్స్.. కారణమిదే!!

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మస్త’ (Brahmastra). రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు ప్రముఖులు నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోన్న నేపధ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు భారీగా ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో.. ఈ ప్రీ రిలీజ్ వేడుక ఆగిపోయింది. ఈ విషయాన్ని చిత్ర పీఆర్వో అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) హాజరు కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ మొదటి నుంచి హైలెట్ చేస్తూ వస్తుంది. దీంతో తారక్ ఫ్యాన్స్ భారీగా హాజరవగా.. చివరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసినట్లుగా తెలపడంతో.. ఫ్యాన్స్ నిరాశకు లోనవుతూ.. ట్విట్టర్ వేదికగా చిత్రయూనిట్‌పై ఫైర్ అవుతున్నారు. (Brahmastra Pre release Event)


అయితే కొంత మంది తారక్ ఫ్యాన్స్ ఈ వేడుక క్యాన్సిల్ అయినందుకు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. తారక్ ఈ వేడుకకు వస్తున్నారని తెలిసినప్పటి నుంచి.. వారు రావద్దంటూ ఎన్టీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. కారణం ఈ సినిమా బాలీవుడ్ చిత్రం కావడంతో పాటు, కరణ్ జోహార్ వంటి వారు నిర్మించడమే. కరణ్ జోహార్ నిర్మించిన ఏ సినిమా అయినా.. ప్రస్తుతం బాయ్‌కాట్ ట్రెండ్‌కు గురవుతుంది. అందుకు చెబుతున్నారో.. లేదంటే వేరే ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఫ్యాన్స్ చాలా మందికి తారక్ ఈ వేడుకకు హాజరవడం ఇష్టం లేదు. ఇప్పుడు ఏకంగా ఆ ఈవెంటే క్యాన్సిల్ అవడంతో.. వారి సంతోషానికి అవధులే లేవు. 


ఇక వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ అయినప్పటికీ.. సాయంత్రం 8 గంటలకు హైదరాబాద్ పార్క్ హయాత్‌లో ‘బ్రహ్మస్త్ర’ మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించబోతున్నారట. ఈ కార్యక్రమంలో.. ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ కావడానికి కారణం తెలిసే అవకాశం ఉంది. ఇక పార్క్ హయాత్‌‌తో జరిగే మీడియా సమావేశానికి తారక్ కూడా హాజరవుతున్నట్లుగా సమాచారం.

Updated Date - 2022-09-02T23:57:49+05:30 IST