Bollywood : భవిష్యత్తును డిసైడ్ చేసే అస్త్రం ఇదేనా?

ABN , First Publish Date - 2022-09-04T22:06:05+05:30 IST

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్లు అందించి.. వందల కోట్ల వసూళ్ళను కళ్ళచూసిన బాలీవుడ్ ఇండస్ట్రీ.. ఇప్పుడు పరాజయాల పరంపరతో పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. వరుస ఫ్లాప్స్ వచ్చిపడిపోతుండడం ఒక కారణమైతే.. టాలీవుడ్ చిత్రాలు వందల, వేలకోట్లు సాధించేయడం వారికి మింగుడు పడడం లేదు.

Bollywood : భవిష్యత్తును డిసైడ్ చేసే అస్త్రం ఇదేనా?

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్లు అందించి.. వందల కోట్ల వసూళ్ళను కళ్ళచూసిన బాలీవుడ్ ఇండస్ట్రీ.. ఇప్పుడు పరాజయాల పరంపరతో పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. వరుస ఫ్లాప్స్ వచ్చిపడిపోతుండడం ఒక కారణమైతే.. టాలీవుడ్ చిత్రాలు వందల, వేలకోట్లు సాధించేయడం వారికి మింగుడు పడడం లేదు. ఆఖరికి ‘కార్తికేయ 2’ (Karthikeya 2) మూవీ కూడా నార్త్‌లో అదరగొట్టేసింది. నిఖిల్ (Nikhil) సినిమాలు అంతగా చూసి ఉండని బీ టౌన్ ఆడియన్స్..  అతడి సినిమాకి మాత్రం బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో అక్కడ సూపర్ స్టార్లు ఆమిర్ ఖాన్ (Aamir Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar) సైతం చేతులెత్తేశారు. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి. కొన్ని సినిమాలకయితే అసలు ఓపెనింగ్సే రాలేదు. అలా బాలీవుడ్ ఉనికిని, ఆధిపత్యాన్ని ప్రశ్నార్ధకంలో పడేసింది మన తెలుగు సినిమా. ఇప్పుడు వారి భవిష్యుత్తును నిర్ణయించే ఒకే ఒక అస్త్రంగా ‘బ్రహ్మాస్త’ (Brahmastra) కనిపిస్తోంది. 


ఈ నెల 9న పాన్ ఇండియా స్థాయిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ అత్యంత గ్రాండ్‌గా ఈ సినిమా విడుదలవుతోంది. అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను ఏకంగా మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. వాటిలో మొదటి భాగం ‘శివ’ (Shiva) మిగతా రెండు భాగాల పరిస్థితిని డిసైడ్ చేస్తుంది. రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియాభట్, నాగార్జున ఇలా బిగ్గెస్ట్ స్టార్స్ కు ఏమాత్రం కొదవలేని సినిమా ఇది. దేశ వ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ చేపట్టారు. తెలుగు వెర్షన్ కోసం మెగాస్టార్ చిరంజీవిని, రాజమౌళిని రంగంలోకి దింపారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకున్నాయి. ‘కేజీఎఫ్, ఆర్.ఆర్.ఆర్, పుష్ప’ రికార్డుల్ని బ్రేక్ చేసే సత్తా ‘బ్రహ్మాస్త్ర’ కు ఉందని నమ్ముతున్నారు. 


దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకున్న బ్రహ్మాస్త్ర చిత్రం, పెట్టుబడి రాబట్టి, కొత్త రికార్డులు నెలకొల్పాలంటే.. కనీవినీ ఎరుగని హిట్ కొట్టాలి. అలా జరిగితేనే బాలీవుడ్ కాస్తంతైనా కోలుకుంటుంది. లాల్ సింగ్ చద్దా (Lalsingh Chadda), రక్షాబంధన్ (Rakshabandhan), షంషేరా (Shamshera) చిత్రాలకు ఎదురైన చేదు అనుభవాలు ఈ సినిమాకి ఎదురైతే మాత్రం ఇకపై భారీ బడ్జెట్ అనే పదాన్ని పలకడానికి కూడా బాలీవుడ్ భయడడడం ఖాయమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. సో.. బాలీవుడ్ బడా చిత్రాల భవిష్యుత్తును ‘బ్రహ్మాస్త్ర’ నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పాన్ ఇండియా బాక్సాఫీస్ పై ఈ  ‘బ్రహ్మాస్త్రం’ ఏ స్థాయిలో ఫలితాన్నిస్తుందో చూడాలి.  

Updated Date - 2022-09-04T22:06:05+05:30 IST