Brahmastra: దేవ్ పాత్రలో కనిపించేదెవరు

ABN , First Publish Date - 2022-09-09T23:25:44+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part 1: Shiva). భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. బాలీవుడ్ క్రేజీ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor),

Brahmastra: దేవ్ పాత్రలో కనిపించేదెవరు

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part 1: Shiva). భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. బాలీవుడ్ క్రేజీ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో, హీరోయిన్‌గా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలైంది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయని అనేక మంది చెప్పారు. కొత్త పాయింట్ అయినప్పటికి దర్శకుడు దానిని చెప్పడంలో విపలమయ్యాడని పేర్కొన్నారు. ఎండ్ కార్డ్స్‌లో రెండో భాగాన్ని ప్రకటించారు. ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 2: దేవ్’ (Brahmastra Part 2: Dev)అని టైటిల్ అనౌన్స్ చేశారు. కానీ, దేవ్ పాత్రలో ఎవరు నటిస్తారో మేకర్స్ మాత్రం ప్రకటించలేదు. 


దేవ్ పాత్ర కోసం మేకర్స్ ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), హృతిక్ రోషన్ (Hrithik Roshan) లతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. కానీ, హృతిక్ చేతిలో ఇప్పటికే అనేక భారీ ప్రాజెక్టులున్నాయి. ‘ఫైటర్’, ‘క్రిష్-4’ లను అతడు పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల హృతిక్ ప్రాజెక్టుకు సమయం కేటాయించలేడు. దేవ్ పాత్రను రణ్‌వీర్ సింగ్ పోషించే అవకాశం ఉంది. శివుడికి మరో పేరే దేవ్, మహాదేవ్. పార్వతి పాత్రను ఇప్పటికే దీపికా పదుకొణె ఓకే చేసింది. దీంతో మేకర్స్ రణ్‌వీర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది. ‘బ్రహ్మాస్త్ర’ ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్స్‌లో విడుదల అయింది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం మొదటి రోజు రూ. 30కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టనుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘బ్రహ్మాస్త్ర’ లో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనిరాయ్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.   

Updated Date - 2022-09-09T23:25:44+05:30 IST