Brahmastra: అవెంజర్స్‌ని మించిపోయిన రణ్‌బీర్ సినిమా

ABN , First Publish Date - 2022-09-11T22:51:17+05:30 IST

సెలబ్రిటీ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan

Brahmastra: అవెంజర్స్‌ని మించిపోయిన రణ్‌బీర్ సినిమా

సెలబ్రిటీ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో, హీరోయిన్‌లుగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించాడు. ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్‌‌స్టార్ స్టూడియోస్‌, ప్రైమ్ ఫోకస్ వంటి సంస్థలు కలసి నిర్మించాయి. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. బీ టౌన్ హిస్టరీలోనే అత్యధికంగా రూ.410కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల అయింది. 


‘బ్రహ్మాస్త్ర’ లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని అనేక మంది కొనియాడారు. ఈ చిత్రానికి వీఎఫ్‌‌ఎక్స్ సేవలను ప్రైమ్ ఫోకస్ అందించింది. తాజాగా ఆ సంస్థ సీఈవో నమిత్ మల్హోత్రా (Namit Malhotra) సినిమాకు సంబంధించిన ఆసక్తికర సంగతులను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ మూవీలో 4,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉన్నాయని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వచ్చిన ఏ చిత్రంలోను ఇన్ని వీఎఫ్‌ఎక్స్ షాట్స్ లేవని తెలిపాడు. ‘‘అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో 2,400 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉంటే, ‘బ్రహ్మాస్త్ర’ లో మాత్రం అత్యధికంగా 4,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఈ విజువల్ ఎఫెక్ట్స్‌ను చూస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది’’ అని నమిత్ మల్హోత్రా వెల్లడించాడు. ‘బ్రహ్మాస్త్ర’ మూడు భాగాలుగా రూపొందనుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 75కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు ఆ కలెక్షన్స్ మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2022-09-11T22:51:17+05:30 IST