Brahmastra: విడుదలకి ముందే.. ఆ హిట్ మూవీ రికార్డుని బ్రేక్ చేసిన రణ్‌బీర్ మూవీ

ABN , First Publish Date - 2022-09-05T14:21:23+05:30 IST

బాలీవుడ్ జనాలతోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’...

Brahmastra: విడుదలకి ముందే.. ఆ హిట్ మూవీ రికార్డుని బ్రేక్ చేసిన రణ్‌బీర్ మూవీ

బాలీవుడ్ జనాలతోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంతో అమితాబ్ బచ్చన్‌, టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిన ఈ ఫాంటసీ మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 


అయితే.. పలు కారణాల వల్ల బ్రహ్మాస్త్రకి సైతం బాలీవుడ్ బాయ్‌కాట్ సెగ తగలింది. దీంతో ఈ మూవీ పరిస్థితి ఏంటా అని మేకర్స్‌తో పాటు రణ్‌బీర్, ఆలియా అభిమానులు కూడా సందిగ్ధంలో పడ్డారు. ఈ తరుణంలో వారికి ఊరటనిస్తూ.. ఈ మూవీ విడుదలకి ముందే బాలీవుడ్ హిట్ మూవీ ‘భుల్ భూలయ్యా 2 (Bhool Bhulaiyaa 2)’ క్రియేట్‌ చేసిన ఓ రికార్డుని బ్రేక్ చేసింది. కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ జంటగా నటించిన ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్‌లో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లని కొల్లగొట్టగా.. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మొదటి రోజే రూ.14 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. అనంతరం వచ్చిన ఏ స్టార్ మూవీ కూడా ఈ సినిమా రికార్డుని బ్రేక్ చేయలేకపోయింది.


ఈ తరుణంలో రణ్‌బీర్ కొత్త మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఆ రికార్డుని బ్రేక్ చేసింది. దీనికి సంబంధించి ఓ పోస్టుని ప్రముఖ సినీ విశ్లేషకుడు సుమిత్ కాదేల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో.. ‘కార్తీక్ ఆర్యన్ భూల్ భూలయ్యా 2నే మొదటి రోజే రూ.14 కోట్ల వసూళ్లు సాధించింది. అదే 2022లో హిందీ సినిమాల్లో ఇదే అత్యధికం. ఈ రికార్డుని చివరకు రణ్‌బీర్ కపూర్ బ్రహ్మస్త్ర బ్రేక్ చేసింది’ రాసుకొచ్చారు.




ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘రూ.30 కోట్ల భూల్ భూలయ్యా 2 రూ.14 కోట్లు సాధిస్తే.. దాన్ని బ్రేక్ చేయాలంటే రూ.410 కోట్ల బ్రహ్మాస్త్ర దాదాపు రూ.192 కోట్లు సాధించాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ బాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 8000 స్క్రీన్స్‌లో విడుదల కానుంది. అందులో 5000 భారత్‌లో కాగా, ఓవర్సీస్‌లో 3000 తెరల్లో విడుదల కానుండడం విశేషం.

Updated Date - 2022-09-05T14:21:23+05:30 IST