Brahmaji: అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా!

ABN , First Publish Date - 2022-08-31T03:01:03+05:30 IST

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘లైగర్’ (Liger) సినిమా విడుదల రోజు.. యాంకర్ కమ్ నటి అనసూయ (Anasuya) చేసిన ఓ ట్వీట్ పెద్ద యుద్ధానికే దారితీసింది. ‘అమ్మ ఉసురు ఊరికే పోదు.. కర్మ’ అంటూ

Brahmaji: అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా!

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘లైగర్’ (Liger) సినిమా విడుదల రోజు.. యాంకర్ కమ్ నటి అనసూయ (Anasuya) చేసిన ఓ ట్వీట్ పెద్ద యుద్ధానికే దారితీసింది. ‘అమ్మ ఉసురు ఊరికే పోదు.. కర్మ’ అంటూ.. అనసూయ చేసిన ట్వీట్.. ప్రత్యక్షంగా.. పరోక్షంగా ‘లైగర్’ని ఉద్దేశించే అనేలా జనాల్లోకి.. ముఖ్యంగా రౌడీ ఫ్యాన్స్‌లోకి వెళ్లిపోయింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెపై ట్రోలింగ్‌కి దిగారు. ‘ఆంటీ’ (Anuty) అంటూ అసభ్యకర పోస్టులతో అనసూయని విసిగించారు. అయినా కూడా అనసూయ ఎక్కడా తగ్గలేదు. ప్రతి ట్వీట్‌కు సమాధానమిస్తూనే వచ్చింది. ‘నేను మీకేమీ చుట్టాన్ని కాదు.. ఆంటీ అని పిలవాల్సిన అవసరం లేదు. నాకొక పేరుంది. ఆ పేరుతో పిలిస్తే చాలు..’ అంటూ కాస్త ఘాటుగానే రిప్లయ్‌లు ఇచ్చింది. ఇంకాస్త అతి చేసిన వారిని కూడా ఆమె వదిలి పెట్టలేదు. ‘ఆంటీ’ అన్నందుకు కాదు కానీ.. అలా పిలుస్తూ.. అసభ్యకర పదజాలం వాడిన వారందరిపై ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చింది. ఈ విషయం కూడా స్వయంగా తనే తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇది అనసూయ, ‘లైగర్’ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య జరిగిన సోషల్ మీడియా యుద్ధం. ఈ యుద్ధానికి నటుడు బ్రహ్మాజీ (Brahmaji) మరింత ఆజ్యం పోసేలా ఇప్పుడొక ట్వీట్ చేశారు.


మాములుగా అయితే అనసూయ.. ‘లైగర్’ విషయంలో కామ్‌గానే ఉండొచ్చు. ఎందుకంటే.. ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ దాదాపు పరాజయాన్నే చవిచూస్తున్నాయి. ఓ నాలుగైదు సినిమాలు మినహా.. బాక్సాఫీస్ వద్ద నిలబడి ఆడిన చిత్రాలు లేనే లేవు. కానీ.. అనసూయ గతంలో తనని టార్గెట్ చేసిన వారికి తగిలేలా.. ట్వీట్‌తో కొట్టింది. దీంతో.. విజయ్ ఫ్యాన్స్‌తో పాటు మరికొందరు హీరోల ఫ్యాన్స్ కూడా.. ‘ఆంటీ’ అంటూ ఆమెను సంభోదిస్తూ.. ట్వీట్స్ చేయడంతో.. నెట్ ప్రపంచంలో రెండు రోజుల పాటు ఈ వ్యవహారమే వైరల్ అయింది. సరే, ఇప్పుడు కాస్త సద్దుమణిగింది కదా.. అనుకుంటున్న సమయంలో.. ‘ఏమి లేదు అంకుల్’ అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు.. ‘అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా! ఏజ్, బాడీ షేమింగా..’’ అంటూ  బ్రహ్మాజీ సరదాగా స్పందించారు. ఈ ట్వీట్‌కు ఆయన మంచి రీచ్‌ను కూడా పొందారు. లైకులు, కామెంట్ల‌తో బ్రహ్మాజీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు కొందరు.. ‘వావ్.. భలే ఇచ్చారు’ అని కామెంట్లు చేస్తుంటే, సహనటికి సపోర్ట్ చేయకుండా.. ఇప్పుడు మళ్లీ గొడవలు రేపుతున్నారా? అంటూ మరికొందరు నెటిజన్లు బ్రహ్మాజీపై ఫైర్ అవుతున్నారు. ఇంకొందరైతే ‘మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఫలానా ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు’ అంటూ సరదాగా మిమ్స్ చేసి వదులుతున్నారు. (Brahmaji Uncle Tweet)



Updated Date - 2022-08-31T03:01:03+05:30 IST