Brad Pitt: కొత్త సినిమా ప్రీమియర్ షోకి స్కర్ట్‌లో హాలీవుడ్ టాప్ హీరో.. అందుకే ఆ డ్రెస్స్‌లో వచ్చానంటూ..

ABN , First Publish Date - 2022-08-03T19:31:01+05:30 IST

యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన హాలీవుడ్ నటుడు బ్రాడ్‌ పిట్..

Brad Pitt: కొత్త సినిమా ప్రీమియర్ షోకి స్కర్ట్‌లో హాలీవుడ్ టాప్ హీరో.. అందుకే ఆ డ్రెస్స్‌లో వచ్చానంటూ..

యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన హాలీవుడ్ నటుడు బ్రాడ్‌ పిట్ (Brad Pitt). ఈ హీరో కొన్నిసార్లు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ హీరో తాజాగా నటించిన చిత్రం ‘బుల్లెట్ ట్రైన్(Bullet Train)’. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రీమియర్ షోలను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేస్తున్నారు. కొన్ని వారాల క్రితం బెర్లిన్‌లో ఈ మూవీ ప్రీమియర్ షో వేశారు. దానికోసం రెడ్ కార్పెట్‌పై మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్(Skirt), బూట్‌లను ధరించి, వదులుగా ఉండే నార చొక్కా, జాకెట్‌తో వచ్చాడు. దీంతో ఈయన లుక్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది. దీనిపై తాజాగా లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా స్పందించాడు. 


లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మూవీ ప్రీమియర్ షోకి బ్రాడ్ పిట్ నార్మల్‌ డ్రెస్సింగ్‌కి వచ్చాడు. రెడ్ కార్పెట్‌పై నడిచిన బ్రాడ్ బెర్లిన్‌లో తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ.. ‘అలా ఎందుకు చేశానో కరెక్టుగా నాకు తెలియదు. కానీ త్వరలో మనందరం చనిపోతాం. అందుకే కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం అనిపించింది’ అని అలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే.. ఇంతకుముందు రిటైర్‌మెంట్ ప్లాన్ గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘నేను రిటైర్ అవుతున్నాను అనే ఉద్దేశ్యంతో నేను అనలేదు. నేను ప్రస్తుతం మధ్య వయస్సులో ఉన్నాను. చివరి రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నానో తెలియజేశాను అంతే’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-08-03T19:31:01+05:30 IST