నా కెరీర్ చివరి అంకంలో ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన Hollywood స్టార్

ABN , First Publish Date - 2022-06-24T16:43:23+05:30 IST

వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ (Once Upon a Time in Hollywood), వరల్డ్ వార్ జెడ్ (World War Z) వంటి సినిమాలతో..

నా కెరీర్ చివరి అంకంలో ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన Hollywood స్టార్

వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ (Once Upon a Time in Hollywood), వరల్డ్ వార్ జెడ్ (World War Z) వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు బ్రాడ్ పిట్ (Brad Pitt). వరుసగా సూపర్ హిట్‌‌లతో దూసుకుపోతున్న ఈ నటుడు ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్, బేబీలోన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ స్టార్ తన కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.


బ్రాడ్ పిట్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో చివరి దశలో ఉన్నట్లు భావిస్తున్నాను. తర్వాతి జీవితం ఎలా ఉంటుంది. దాన్ని ఎలా డిజైన్ చేయాలని ఆలోచిస్తున్నాను’ అని 58 ఏళ్ల బ్రాడ్‌పిట్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్‌పై వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ సినిమాలో బ్రాడ్ పిట్‌‌ని డైరెక్ట్ చేసిన క్వెంటిన్ టరాన్టినో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘బ్రాడ్ పిట్ చెప్పింది కనుక నిజమైతే.. హాలీవుడ్ మూవీ పరిశ్రమ ఓ బిగ్ స్టార్‌ని కోల్పోయినట్లే’ అని తెలిపాడు.


కాగా.. బ్రాడ్ పిట్ 2020లో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో ఆయన నటనకి బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. ఈ ఏడాది ఆయనవి రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో.. బుల్లెట్ ట్రైన్ ఆగస్టు 5న విడుదల కానుండగా.. బాబిలోన్ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా.. బ్రాడ్ పిట్ ‘ప్లాన్ బీ’ నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు చేస్తున్నాడు.

Updated Date - 2022-06-24T16:43:23+05:30 IST