అది దురుద్దేశంతో చేసిన పని.. మాజీ భార్య Angelina Jolie పై Brad Pitt షాకింగ్ కామెంట్స్..

ABN , First Publish Date - 2022-06-08T18:26:57+05:30 IST

హాలీవుడ్ బ్యూటీ‌ఫుల్ కపుల్ అందాల తార ఏంజెలీనా జోలీ, నటుడు బ్రాడ్ పిట్ కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే....

అది దురుద్దేశంతో చేసిన పని.. మాజీ భార్య Angelina Jolie పై Brad Pitt షాకింగ్ కామెంట్స్..

హాలీవుడ్ బ్యూటీ‌ఫుల్ కపుల్ అందాల తార ఏంజెలీనా జోలీ, నటుడు బ్రాడ్ పిట్ కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి వారి మధ్య ఏదో ఒక విషయమై వివాదం జరగుతూనే ఉంది. ఈ నటులిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అయితే విడిపోయిన తర్వాత జోలి తమ కంపెనీ సదరన్ ఫ్రాన్స్ వైన్యార్డ్‌‌లోని తన వాటాగా ఉన్న 50 శాతం షేర్లను రష్యన్ ఒలిగార్చ్‌కు అమ్మేసింది.


దీనిపై పిట్ ఫిబ్రవరిలో కేసు వేశాడు. జోలీ, తను ఒకరికి తెలియకుండా మరొకరు తమ వాటాలను విక్రయించకూడదని ఒప్పందం చేసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. కానీ.. జోలీ తన అనుమతి లేకుండానే తన వాటాను రష్యకు చెందిన ఓ కంపెనీకి అమ్మేసిందని, అది రష్యన్ బిలియనీర్ యూరి షెప్లర్‌కి చెందినదని ఆరోపించాడు. అది ఆమెకు లాభం కలిగేలా.. తనకు నష్టం కలిగేలా దురుద్ధేశంతోనే ఈ పని చేసిందని తెలిపాడు.


తాజాగా లాస్ ఏంజెల్స్ కోర్టు‌లో మరో కేసు ఫైల్ చేశాడు. అందులో.. ‘షెప్లర్ రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంతర్గత సర్కిల్‌లోని వ్యక్తులతో వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను కొనసాగిస్తున్నాడు. పుతిన్ ప్రభావం నుంచి బయటపడడానికి షెప్లర్ తీవ్ర ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ.. అప్పటికే ఆయనకి చెందిన సోలీ బ్రాండ్‌ని అంతర్జాతీయ మంచి పేరు ఉంది. అయితే.. స్టోలీ వోడ్కా అంటే అందరికీ రష్యానే గుర్తుకు వస్తుంది. అందుకే ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా వినియోగదారులు స్టోలి వోడ్కాను కాలువలో పారబోస్తున్న ఎన్నో వీడియోలు బయటికి వచ్చాయి. అది ఆయన రెప్యూటేషన్‌పై ప్రభావం చూపుతుంది. ఇది షెప్లర్ వాటాదారుగా ఉన్న నా కంపెనీకి, నాకు నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి’ అని పేర్కొన్నాడు. అయితే.. ఈ ఆరోపణలపై స్టోలీ వోడ్కా యాజమాన్యం ఇంకా స్పందించలేదు.

Updated Date - 2022-06-08T18:26:57+05:30 IST